అక్కడ మాస్క్‌లు అవసరం లేదు : చైనా

Masks Outdoors No Longer Necessary In Beijing - Sakshi

బీజింగ్‌ : ప్రపంచవ్యాప్తంగా కరోనా నియంత్రణలో భాగంగా ఇళ్ల నుంచి బయటకు వెళ్లేవారు మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. అలాగే చాలా దేశాలు లాక్‌డౌన్‌ విధించి.. కరోనా కట్టడికి కృషి చేస్తున్నాయి. అయితే  ప్రపంచమంతా కరోనా ధాటికి వణికిపోతున్న ఈ సమయంలో.. వైరస్‌ తొలి కేసు నమోదైన చైనాలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కరోనా కేసులు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టడంతో చైనాలో ఆంక్షలను నెమ్మదిగా ఎత్తివేస్తున్నారు. తాజాగా చైనా రాజధాని బీజింగ్‌లో బయటకు వెళ్లేవారు మాస్క్‌ల ధరించే అవసరం లేదని అధికారులు తెలిపారు.

ఈ మేరకు బీజింగ్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ప్రివెన్షన్‌ ఆదివారం కొత్త మార్గదర్శకాలు జారీచేసింది. అయితే  ప్రతి ఒక్కరు ఇతరులకు దగ్గరికి వెళ్లకుండా.. కనీస దూరం పాటించడం తప్పనిసరి అని తెలిపింది. వాతావరణం బాగున్నప్పుడు ప్రజలు బయటిప్రాంతంలో వ్యాయామం చేసుకోవడాన్ని ఇది ప్రోత్సహిస్తుందని.. తద్వారా మెరుగైన ఆరోగ్యం సమకూరుతుందని పేర్కొంది. (చదవండి : రెస్టారెంట్‌ వెలుపల వేచిచూసిన ప్రధాని)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top