విమానాన్ని వదల్లేదు; వీడియో వైరల్‌

A Man Begging In Flight Video Viral - Sakshi

దోహా : ‘కాదేది కవితకనర్హం’ అన్నట్లు అడుక్కోవడానికి కూడా ప్రదేశంతో సంబంధం లేదని నిరూపించాడు ఓ 50 ఏళ్ల మధ్య వయస్కుడు. ఇంతకూ ఇతను అడుక్కున్నది ఎక్కడనుకుంటున్నారు...ఆకాశంలో ఎగురుతున్న విమానంలో. అవును విమానంలోనే అడుక్కుంటున్నాడు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌ చేస్తూ వైరల్‌గా మారింది ఈ వీడియో.

వీడియోలో ఉన్న దాని ప్రకారం దోహా నుంచి షిరాజ్‌ ప్రయాణిస్తున్న విమానంలో ఆకస్మాత్తుగా ఓ మధ్యవయస్కుడు లేచి చేతిలో ప్లాస్టిక్‌ పౌచ్‌ పట్టుకుని తన తోటి ప్రయాణికుల దగ్గరకు వెళ్లి అడుక్కోవడం ప్రారంభించాడు. కొందరు అతనికి డబ్బులు కూడా ఇచ్చారు. ఇంతలో ఎయిర్‌లైన్‌ సిబ్బంది వచ్చి అతన్ని వారించడంతో వెళ్లి తన సీటులో కూర్చున్నాడు. ఈ తతంగాన్నంతా వీడియో తీసి వాట్సాప్‌లో పోస్టు చేసారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతున్న ఈ వీడియో గురించి రకరకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

కొందరైతే ఏకంగా అడుకుంటున్న వ్యక్తిని పాకిస్తానీగా భావించి...‘ఈ ప్రయాణికుడు ప్రస్తుతం మన దేశంలో ఉన్న అవినీతికి నిదర్శంగా నిలుస్తున్నాడు. ఇప్పటికైనా మనం కళ్లు తెరిచి మనకంటూ కొన్ని నిబంధనలను ఏర్పాటు చేసుకోకపోతే నిజంగా అది మన దేశానికి అవమానకరం’ అంటూ కామెంట్‌ చేసాడు. అయితే దన్యాల్‌ గిలానీ అనే ఒక పాకిస్తానీ అధికారి ఈ వీడియోలో అడుక్కుంటున్న వ్యక్తికి సంబంధించిన వివరాలను పోస్టు చేసాడు.

‘దోహా షిరాజ్‌ విమానంలో అడుక్కుంటున్న వ్యక్తి పాకిస్తానీ కాదు. అతను ఒక ఇరానియన్‌. అతను మాట్లాడుతున్న భాషా పార్సీ. అతన్ని ఉన్న పళంగా దేశం నుంచి తరలించారు. దాంతో  చేతిలో చిల్లగవ్వ కూడా లేకపోవడంతో ఆ వ్యక్తి తన తోటి ప్రయాణికులను అడుక్కుంటున్నాడు’ అని పోస్టు చేసాడు. దోహా నుంచి షిరాజ్ వరకు ఖతార్ ఎయిర్వేస్ విమాన టిక్కెట్ ధర 2,000 - 3,000 ఖతారీ రియాల్స్‌(రూ. 55,875) వరకూ ఖర్చవుతుంది.

టికెట్టు కొనే స్తోమత లేక అలా చేస్తున్నాడని కొందరు సానుభూతి తెలపుతన్న నేపధ్యంలో ఈ వ్యక్తి తమకు పేయింగ్‌ కస్టమర్‌(అంటే టికెట్టు కొన్న ప్రయాణికుడి)గా నిర్ధారించింది ఖతార్‌ ఎయిర్‌వేస్‌.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top