ప్రేమికుడితో మలియా ఒబామా చెట్టాపట్టాల్‌! | Malia spotted with boyfriend IN New York | Sakshi
Sakshi News home page

Jan 23 2018 10:04 AM | Updated on Oct 17 2018 4:36 PM

Malia spotted with boyfriend IN New York - Sakshi

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కూతురు మలియా ఒబామా ప్రేమలో మునిగితేలుతున్నదంట. ఆమె తాజాగా తన కొత్త ప్రేమికుడు రోరి ఫర్కుహర్సన్‌తో న్యూయార్క్‌ నగరంలో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ కనిపించింది. రోరీ బ్రిటన్‌ వాసి. బ్రిటన్‌లో అత్యంత సంపన్నులు చదివే ప్రఖ్యాత రగ్బీ స్కూల్‌లో చదువుకొని స్కూల్‌ లీడర్‌గా వ్యవహరించాడు.

రోరీ తండ్రి చార్లెస్‌ ఫర్కుహర్సన్‌ లండన్‌లోని ఓ ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ గ్రూప్‌కు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌, డైరెక్టర్‌గా ఉన్నారు. మలియాతో సన్నిహితంగా రోరీ సిగరెట్‌ తాగుతూ కనిపించగా.. మలియా నవ్వులు చిందిస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. 19 ఏళ్ల వయస్సులో ఉన్న మలియా, రోరీ హార్వర్డ్‌ యూనివర్సిటీలో కలిసి చదువుతున్నారని తెలుస్తోంది. హార్వర్డ్‌-యేల్‌ ఫుట్‌బాల్‌ గేమ్‌ సందర్భంగా ఈ ఇద్దరూ ఇష్టంగా ముద్దు పెట్టుకుంటున్న ఫొటోలు అప్పట్లో హల్‌చల్‌ చేశాయి.

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement