మాల్దీవుల్లో అత్యవసర స్థితి | Maldives state of emergency declared by government amid political crisis | Sakshi
Sakshi News home page

మాల్దీవుల్లో అత్యవసర స్థితి

Feb 6 2018 3:37 AM | Updated on Sep 17 2018 4:55 PM

Maldives state of emergency declared by government amid political crisis - Sakshi

మాలే: రాజకీయ సంక్షోభం నెలకొన్న మాల్దీవుల్లో అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ సోమవారం అత్యవసర స్థితి విధించారు. దీంతో భద్రతా దళాలకు విశేషాధికారాలు సంక్రమిస్తాయి. అనుమానితులను వారు అరెస్ట్‌ చేయొచ్చు. నిర్బంధించొచ్చు. 15 రోజులపాటు అత్యవసర స్థితి అమలులో ఉంటుందని యమీన్‌ వ్యక్తిగత కార్యదర్శి అజిమా ప్రభుత్వ టీవీ చానల్‌ ద్వారా ప్రకటించారు.

9 మంది అసమ్మతి నేతలను జైలు నుంచి విడుదల చేయాలని మాల్దీవుల సుప్రీంకోర్టు గత గురువారం ఆదేశించడం, ఇందుకు యమీన్‌ నిరాకరిస్తున్న నేపథ్యంలో దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. తీర్పును వెనక్కు తీసుకోవాలంటూ యమీన్‌ తాజాగా న్యాయమూర్తులకు లేఖ రాశారు. అత్యవసరమైతే తప్ప భారతీయులు కొన్నిరోజులు మాల్దీవులకు వెళ్లకూడదని భారత విదేశాంగ శాఖ సూచించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement