అరుదైన ఘనత దక్కించుకున్న మలాలా

న్యూయార్క్ : నోబెల్ శాంతి బహుమతి గ్రహిత, పాకిస్తాన్‌కు చెందిన మలాలా యూసఫ్ జాయ్ మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత టీనేజ్ యువతిగా గుర్తింపు పొందింది. 21వ శతాబ్ధపు రెండవ దశకంలో ఫేమస్ టీనేజర్‌గా మలాలా నిలిచినట్లు.. ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. 2010 నుంచి 2019 మధ్య కాలంలో మలాలాకు వచ్చిన గుర్తింపు ఆధారంగా యూఎన్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ మేరకు యూఎన్ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్‌లోని బాలికల విద్య కోసం మలాలా చేసిన పోరాటాన్ని యూఎన్ గుర్తుచేసింది. యుక్త వయసు నుంచే మలాలా బాలిక విద్య గురించి మాట్లాడిందని, తాలిబన్ల అకృత్యాలపై పోరాడిందని తన రిపోర్ట్‌లో పేర్కొంది. ఆమె సేవను గుర్తింపుగా 2014లో నోబెల్ శాంతి బహుమతి వరించిన విషయం తెలసిందే. 2017లో యూఎన్ శాంతిదూతగా కూడా ఆమె నిలిచారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి