పాకిస్తాన్‌ మరో దుశ్చర్య

Maharaja Ranjit Singh Statue Vandalised In Pakistan - Sakshi

ఇస్లామాబాద్‌: ఆర్టికల్‌ 370 రద్దుతో ఇప్పటికే కశ్మీర్‌పై కాలుదువ్వుతున్న పాకిస్తాన్‌ మరో దుశ్చర్యకు పాల్పడింది. సిక్కు పాలకుడు మహారాజా రంజిత్‌ సింగ్‌ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటన శనివారం రాత్రి లాహోర్‌ సమీపంలో చోటుచేసుకుంది. ఘటనపై స్పందించిన లాహోర్‌ సిటీ అధికార ప్రతినిధి తానియా ఖురేషి.. విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఘటనకు పాల్పడ్డ ఇద్దరి వ్యక్తులను గుర్తించామని, వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పూర్తిగా దెబ్బతిన్న విగ్రహానికి మరమత్తులు చేపిస్తామని పేర్కొన్నారు. 

కాగా జమ్మూ కశ్మీర్‌కు  స్వయం ప్రతిపత్తి హోదాను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న అనంతరం... పాకిస్తాన్‌లోని కొన్ని సంఘాలు నిరసనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా పలు హింసాత్మక ఘటనలకు కొందరు వ్యక్తులు పాల్పడ్డారు. దానిలో భాగంగానే సిక్కు పాలకుడైన రంజిత్‌ సింగ్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.  భారత్‌ నిర్ణయంపై పాకిస్తాన్‌ ప్రభుత్వం ఇదివరకే విషంకక్కిన విషయం విధితమే. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top