లార్డ్ స్వరాజ్‌పాల్ రూ. 25 లక్షల సాయం | Lord svarajpal Rs. 25 lakh aid | Sakshi
Sakshi News home page

లార్డ్ స్వరాజ్‌పాల్ రూ. 25 లక్షల సాయం

Oct 14 2013 1:35 AM | Updated on Sep 1 2017 11:38 PM

భీకర పై- లీన్ తుపానును సమర్ధంగా ఎదుర్కొన్నారని భారతీయ అధికారులను ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్‌పాల్ ప్రశంసించారు.

 బీకాన్స్‌ఫీల్డ్(ఇంగ్లండ్): భీకర పై- లీన్ తుపానును సమర్ధంగా ఎదుర్కొన్నారని భారతీయ అధికారులను ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్‌పాల్ ప్రశంసించారు. ప్రాణనష్టం తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్రాల అధికారులు, త్రివిధ దళాలు చేసిన ప్రయత్నాలు ప్రశంసనీయమంటూ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం తన వంతుగా * 25 లక్షలను అందిస్తున్నట్లు తెలిపారు.

ప్రముఖుల ట్వీట్స్
 అమితాబ్‌బచ్చన్: ‘దేవతల ఆగ్రహ ఫలితం పై-లీన్. జాగ్రత్తగా ఉండండి’
 
 మాధురీదీక్షిత్: ‘ఈ తుపాను కష్టం నుంచి గట్టెక్కే ధైర్యాన్ని బాధిత ప్రజలకు ఇవ్వాల్సిందిగా దేవుడిని ప్రార్థిస్తున్నా’
 
 అక్షయ్‌కుమార్: ప్రకృతి ప్రకోపానికి గురైన వారికోసం ప్రార్థిస్తున్నా. శాంతించాలని తప్ప పై-లీన్‌ను ఇంకేం కోరగలం’
 
 మీరానాయర్: ‘ఒడిశా నా స్వరాష్ట్రం. నా రాష్ట్రప్రజలకు ధైర్యం ఇవ్వాల్సిందిగా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’
 
 అనుపమ్‌ఖేర్: ‘ప్రకృతి ఆగ్రహించిన ప్రతీసారి మన ఆస్తిత్వం ప్రశ్నార్థకమవుతుంది’
 

Advertisement
 
Advertisement
Advertisement