ట్యాంకు లీకు.. రక్తమోడిన రోడ్డు | Like a scene out of a horror movie: Blood mixed with embalming fluid seeps out onto the ROAD from a Louisiana funeral home | Sakshi
Sakshi News home page

ట్యాంకు లీకు.. రక్తమోడిన రోడ్డు

Sep 17 2017 5:00 PM | Updated on Apr 3 2019 4:24 PM

ట్యాంకు లీకు.. రక్తమోడిన రోడ్డు - Sakshi

ట్యాంకు లీకు.. రక్తమోడిన రోడ్డు

మార్చురీ గది ట్యాంకు లీక్‌ కావడంతో వేల లీటర్ల రక్తం రోడ్డున పారడం కలకలం రేపింది.

లూసియానా : మార్చురీ గది ట్యాంకు లీక్‌ కావడంతో వేల లీటర్ల రక్తం రోడ్డున పారడం కలకలం రేపింది. గురువారం జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయంతో వణికిపోయారు. మరణించిన వారి శరీరాలకు పోస్టుమార్టం చేసిన తర్వాత శరీర భాగాలను ప్రత్యేకంగా భద్రపరుస్తారు.

పోస్టుమార్టం నిర్వహించే సమయంలో మృత దేహాల నుంచి వచ్చే రక్తాన్ని ఓ ట్యాంకులో నింపుతారు. అలా నింపిన ట్యాంకులో బ్లాకేజ్‌ ఏర్పడటంతో రక్తం రోడ్డుపై పారినట్లు అధికారులు తెలిపారు. మార్చురీ గదిని ప్రైవేట్‌గా నడుపుతున్నారని చెప్పారు. అయితే, కొత్త యాజమాన్యం ఇందుకు తగిన అనుమతులు తీసుకోలేదని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement