లిబియాలో సంక్షోభం

Libya on brink of civil war as anti-government troops surround capital - Sakshi

ట్రిపోలి: అంతర్యుద్ధంతో అతలాకుతలమైన లిబియాలో సాయుధ ఘర్షణ చెలరేగింది. లిబియా కమాండర్‌ ఖలీఫా హఫ్తార్‌కు చెందిన తిరుగుబాటు దళాలు రాజధాని ట్రిపోలివైపు బయలుదేరాయి. అంతర్జాతీయ సమాజం గుర్తింపుపొందిన జీఎన్‌ఏ ప్రభుత్వ దళాలు వారిని రాజధానికి 50 కి.మీ దూరంలో నిలువరించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా జీఎన్‌ఏ దళాలు హఫ్తార్‌ బలగాలపై వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి. హఫ్తార్‌ దళాలు వెంటనే హింసను విడనాడి వెనక్కు వెళ్లాలని ఐక్యరాజ్యసమితి, ఫ్రాన్స్, జర్మనీ సూచించాయి. 2011లో లిబియా పాలకుడు గడాఫీని అమెరికా హతమార్చడంతో ఆ దేశంలో అంతర్యుద్ధం చెలరేగింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top