కెన్నడీ హంతకుడితో సీఐఏకు లింకు లేదు | Latest JFK files say no evidence of CIA links to Oswald | Sakshi
Sakshi News home page

కెన్నడీ హంతకుడితో సీఐఏ లింకుపై ఆధారాలు లేవు

Nov 5 2017 2:24 AM | Updated on Apr 4 2019 3:25 PM

Latest JFK files say no evidence of CIA links to Oswald - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెన్నడీ హత్య కేసుకు సంబంధించి మరికొన్ని దర్యాప్తు పత్రాల్ని అమెరికా తాజాగా విడుదల చేసింది. అయితే కెన్నడీ హంతకుడు లీ హర్వే ఒస్వాల్డ్‌కు సీఐఏతో సంబంధాలపై ఎలాంటి ఆధారాలు దొరకలేదని ఈ దర్యాప్తు పత్రాల్లో వెల్లడైంది. ఒస్వాల్డ్‌ను సీఐఏ పావుగా వాడుకుందా? ఆ నిఘా సంస్థతో అతనికి ఇతర సంబంధాలు ఉన్నా యా? అన్న విషయంపై అమెరికా లోపల, బయట విస్తృతంగా శోధించామని తాజా పత్రాల్లో వెలుగుచూసిన 1975 నాటి సీఐఏ మెమోలో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement