మలేషియా విమానానికి తప్పిన భారీ ప్రమాదం | Landing gear on Malaysian Airlines flight MH192 | Sakshi
Sakshi News home page

మలేషియా విమానానికి తప్పిన భారీ ప్రమాదం

Apr 21 2014 8:08 AM | Updated on Sep 2 2017 6:20 AM

మలేషియా విమానానికి తప్పిన భారీ ప్రమాదం

మలేషియా విమానానికి తప్పిన భారీ ప్రమాదం

మలేషియాకు చెందిన మరో విమానానికి త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది.

న్యూఢిల్లీ : మలేషియాకు చెందిన మరో విమానానికి త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. కౌలాలంపూర్‌ నుంచి బెంగళూరుకు బయలుదేరిన కాసేపటికే  ఎంహెచ్ 192 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని వెంటనే వెనక్కు మళ్లించి సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. దీంతో విమానంలో ఉన్న 157 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. 

 

వాస్తవానికి ఈ విమానం రాత్రి 11:35కు బెంగళూరుకు చేరుకోవాల్సింది.  అయితే సాంకేతిక లోపంతో తిరిగి కౌలాలంపూర్‌లోనే సురక్షితంగా దిగిందని అధికారులు ప్రయాణికుల బంధువులకు సమాచారమిచ్చారు. తమవారు క్షేమంగా ఉన్నారని తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధువులు హర్షం వ్యక్తం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement