హ్యూస్టన్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో అనుమానాస్పద స్థితిలో ఇటీవల మరణించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వెంకన్నగారి కృష్ణ చైతన్య మృతదేహం గురువారం హైదరాబాద్ రానుంది. ఈ విషయాన్ని భారత కాన్సులేట్ కార్యాలయ అధికారి వెల్లడించారు. సిద్దిపేటకు చెందిన చైతన్య మూడేళ్ల కింద అమెరికాకు వెళ్లారు. టెక్సాస్‌లోని డాలస్‌లో ఆర్లింగ్టన్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. కాగా, చైతన్య మరణానికి గల కారణాలు ఇప్పటికీ తెలియదని, అమెరికాలో ఆయన మృత దేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారని, అయితే రిపోర్టులు ఇంకా రాలేదని డిప్యూటీ కాన్సుల్ జనరల్ సురేంద్ర పేర్కొన్నారు. ‘భారత్‌లోని చైతన్య కుటుంబసభ్యులను ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. చైతన్య మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు కృషి చేస్తున్నాం’అని పేర్కొన్నారు.
నేడు హైదరాబాద్‌కు కృష్ణచైతన్య మృతదేహం
Feb 1 2018 4:32 AM | Updated on Feb 1 2018 4:32 AM
Advertisement
Advertisement