
మనకీ ఓ జియాంగ్ ఉండుంటే..
కన్న ఊరును.. చేసిన సాయాన్ని మరిచిపోకూడదంటా రు. చిత్రంలోని జియాంగ్ షుహువా(54) అలా అస్సలు మర్చిపోయే టైపు కాదు.. మరిచిపోకుండా ఏం చేశాడో తెలుసా?
కన్న ఊరును.. చేసిన సాయాన్ని మరిచిపోకూడదంటా రు. చిత్రంలోని జియాంగ్ షుహువా(54) అలా అస్సలు మర్చిపోయే టైపు కాదు.. మరిచిపోకుండా ఏం చేశాడో తెలుసా?
దక్షిణ చైనాలోని జియాంగ్‌కెంగ్ ఓ కుగ్రామం.. ఉన్నోళ్లందరూ పేదోళ్లే... చిన్నాచితకా పనులు చేసుకునేవాళ్లే.. వీళ్ల వద్ద తిండికి లోటున్నా.. ప్రేమాభిమానాలకు మాత్రం ఏమాత్రం లోటు లేదు. అలాంటిచోట పుట్టాడు జియాంగ్.. వాళ్ల మధ్యే పెరిగాడు.. ఉపాధి నిమిత్తం గ్రామాన్ని వీడిన తర్వాత స్వయంకృషితో ఎదిగాడు.
తొలుత నిర్మాణ రంగంలోనూ.. తర్వాత స్టీల్ రంగంలో కోట్లు సంపాదించాడు. అయితే, తన మూలాలను మాత్రం మరువలేదు. ఓనాడు గ్రామానికి తిరిగొచ్చాడు. అక్కడింకా అలాగే ఉంది.. వెంటనే ఉన్న పూరిపాకలన్నిటినీ పీకేయించాడు.. ఒకనాడు తన పట్ల గ్రామస్తులు చూపించిన వాత్సల్యానికి గుర్తుగా అక్కడున్న మొత్తం 72 కుటుంబాల కోసం బ్రహ్మాండమైన అపార్టుమెంట్లు కట్టించేశాడు.
అదీ ఉచితంగా.. వీరిలో తనకు మరింత దగ్గరైన 18 కుటుంబాల కోసం విల్లాలు నిర్మించాడు. ఇదొక్కటేనా.. ముదిమి వయసులో పనిచేయలేక.. పస్తులుండే వృద్ధులు, అల్పాదాయ వర్గాలకు మూడు పూటల ఉచిత ఆహార సదుపాయాన్నీ ఏర్పాటు చేశాడు. అంతేకాదు.. తాను జీవించి ఉన్నంత కాలం వారందరి బాగోగులు చూస్తానని హామీ ఇచ్చాడు.