కరోనా కల్లోలం: అక్కడ పిట్టల్లా రాలిపోతున్నారు | Iran announces 63 new Coronavirus deaths taking total to 354  | Sakshi
Sakshi News home page

కరోనా కల్లోలం: అక్కడ పిట్టల్లా రాలిపోతున్నారు

Mar 11 2020 4:47 PM | Updated on Mar 11 2020 4:53 PM

Iran announces 63 new Coronavirus deaths taking total to 354  - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఇరాన్‌లో కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) బాధితులు  పిట్టల్లా  రాలిపోతున్నారు. అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా బుధవారం ఒక్క రోజే మరో 63 మందిని పొట్టన పెట్టుకుంది. దీంతో తమ దేశంలో ఈ మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 354 కు చేరిందని  ఆరోగ్య అధికారులు ప్రకటించారు. దురదృష్టవశాత్తు గత 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా 63 కొత్త మరణాలు సంభవించాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కియానౌష్ జహాన్పూర్  వెల్లడించారు. అలాగే దేశంలో 958  కొత్తగా కోవిడ్ -19 కేసులను గుర్తించామని తెలిపారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9 వేలకు చేరుకుందన్నారు. 

చదవండి :  కరోనా : మహిళ పరిస్థితి విషమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement