వేలాది ఉద్యోగులకు బైబై! | Intel may cut thousands of jobs by year-end | Sakshi
Sakshi News home page

వేలాది ఉద్యోగులకు బైబై!

Apr 16 2016 5:11 PM | Updated on Sep 3 2017 10:04 PM

వేలాది ఉద్యోగులకు బైబై!

వేలాది ఉద్యోగులకు బైబై!

ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ఇంటెల్.. తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని భావిస్తోంది.

న్యూయార్క్: ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ఇంటెల్.. తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని భావిస్తోంది.  ఇటీవలే ఇద్దరు ఉన్నతస్థాయి ఎగ్జిక్యూటీవ్లకు ఉద్వాసన పలికిన ఈ సంస్థ.. ఈ ఏడాది చివరి నాటికి వేల సంఖ్యలో ఉద్యోగులకు బైబై చెప్పనుందని మీడియా వర్గాలు వెల్లడించాయి.

ఇంటెల్ ఉత్పత్తులు ఆశించిన మేర అమ్మకాల్లో వృద్ధి సాధించకపోవటంతో ఇప్పటికే అమెరికాలో 1100 మంది ఉద్యోగులను తొలగించింది. 2015 డిసెంబర్ నాటికి ఇంటెల్ సంస్థలో ప్రంపంచ వ్యాప్తంగా 1,07,000 మంది పనిచేస్తున్నారు. అయితే అమెరికాలో మాదిరిగానే ఇతర ప్రాంతాల్లో సైతం భారీగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని సంస్థ భావిస్తోంది. కొన్ని చోట్ల సంస్థలోని 10 శాతానికి పైగా ఉద్యోగులను తొలగించాలని ఇంటెల్ భావిస్తున్నట్లు సమాచారం. ఇంటెల్‌కు పర్సనల్ కంప్యూటర్ మార్కెట్లో నిరాశాజనకమైన ఫలితాలు ఎదురౌతున్న నేపథ్యంలో అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని భావిస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement