సిడ్నీలో భారతీయ మహిళ దారుణహత్య | Indian woman stabbed to death in Australia | Sakshi
Sakshi News home page

సిడ్నీలో భారతీయ మహిళ దారుణహత్య

Mar 8 2015 7:04 PM | Updated on Sep 2 2017 10:31 PM

ఓ భారతీయ మహిళ దారుణహత్యకు గురైంది. ఆఫీసు నుంచి ఇంటికి తిరిగివెళ్తున్న మహిళను గుర్తుతెలియని దుండగులు పొడిచి చంపారు.

ఆస్ట్రేలియా: ఓ భారతీయ మహిళ దారుణహత్యకు గురైంది. ఆఫీసు నుంచి ఇంటికి తిరిగివెళ్తున్న మహిళను గుర్తుతెలియని దుండగులు పొడిచి చంపారు. ఈ ఘటన సిడ్నీలో ఆదివారం వెలుగుచూసింది.  సిడ్నీ కాలమానం ప్రకారం.. సాయంత్రం 6గంటల ప్రాంతంలో  ఆమెపై దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఆఫీసు నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో వెనకనుంచి ఓ వ్యక్తి వచ్చి కత్తితో పొడిచాడు. దాంతో తీవ్ర రక్తస్రావమై ఆమె మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. మృతురాలు భారతీయ మహిళ ప్రభా అరుణ్(41)గా పోలీసులు గుర్తించారు. ఆమె సిడ్నీలో ఐటీ కన్సల్టెంట్గా పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని, శివారుప్రాంతం కావడంతో... కొందరు వ్యక్తులు డబ్బులు కోసం ఇటుగా వెళ్లవాళ్లపై దాడులకు పాల్పడుతుంటారని పేర్కొన్నారు. ఒంటిరిగా వెళ్లే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు. కాగా,  కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement