breaking news
Prabha Arun Kumar
-
ప్రభ మృతదేహం బంధువులకు అప్పగింత
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో హత్యకు గురైన భారత మహిళా ఐటీ కన్సల్టెంట్ ప్రభా అరుణ్ కుమార్(41) మృతదేహాన్ని పోలీసులు బుధవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతదేహాన్ని ఆమె స్వస్థలం మంగళూరుకు తీసుకెళ్లారు. కాగా నిందితుల కోసం తాము అన్వేషిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఈ దారుణమైన దాడికి గల కారణాలేమీ తెలియరాలేదని హత్యా దర్యాప్తు అధికారి మైఖేల్ విలింగ్ తెలిపారు. కర్ణాటకకు చెందిన ప్రభ గత శనివారం తన భర్తతో ఫోన్లో మాట్లాడుతూ వెళ్తుండగా హత్యకు గురైన విషయం తెలిసిందే. -
సిడ్నీలో భారతీయ మహిళ దారుణహత్య
-
సిడ్నీలో భారతీయ మహిళ దారుణహత్య
ఆస్ట్రేలియా: ఓ భారతీయ మహిళ దారుణహత్యకు గురైంది. ఆఫీసు నుంచి ఇంటికి తిరిగివెళ్తున్న మహిళను గుర్తుతెలియని దుండగులు పొడిచి చంపారు. ఈ ఘటన సిడ్నీలో ఆదివారం వెలుగుచూసింది. సిడ్నీ కాలమానం ప్రకారం.. సాయంత్రం 6గంటల ప్రాంతంలో ఆమెపై దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఆఫీసు నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో వెనకనుంచి ఓ వ్యక్తి వచ్చి కత్తితో పొడిచాడు. దాంతో తీవ్ర రక్తస్రావమై ఆమె మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. మృతురాలు భారతీయ మహిళ ప్రభా అరుణ్(41)గా పోలీసులు గుర్తించారు. ఆమె సిడ్నీలో ఐటీ కన్సల్టెంట్గా పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని, శివారుప్రాంతం కావడంతో... కొందరు వ్యక్తులు డబ్బులు కోసం ఇటుగా వెళ్లవాళ్లపై దాడులకు పాల్పడుతుంటారని పేర్కొన్నారు. ఒంటిరిగా వెళ్లే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు. కాగా, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.