దుబాయ్‌లో కేరళ వాసిని వరించిన అదృష్టం

Indian Wins Lottery In Abu Dhabi - Sakshi

అబుదబీ : అదృష్టం అంటే అతడిదే. పొట్టకూటి కోసం వెళ్లిన పరాయి దేశాన్ని శాశ్వతం వదిలి స్వదేశానికి వచ్చేస్తున్న వేళ లాటరీ రూపంలో అదృష్టం వీడ్కోలు పలికింది. ఏకంగా రూ.13.5 కోట్లు వచ్చి ఒళ్లో పడ్డాయి! ఈ లక్కీమేన్‌ కేరళ వాసి టోజో మాథ్యూ(30). అబుదబీలో సివిల్‌ సూపర్‌వైజర్‌గా పనిచేసిన ఆయన దుబాయిని వదిలి స్వదేశానికి వచ్చేస్తుండగా అదృష్ట దేవత కరుణించింది. అబుదబీ విమానాశ్రయంలో ఆయన కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌ నెలవారీ బిగ్‌ టికెట్‌ రాఫెల్‌ డ్రాలో దాదాపు రూ. 13.1 కోట్లు(7 మిలియన్ల దిర్హమ్‌లు) గెల్చుకున్నట్టు‘ ఖలీజ్‌ టైమ్స్‌’  వెల్లడించింది.

‘భారత్‌కు పయనమవుతూ జూన్‌ 24న అబుదబీ విమానాశ్రయంలో టికెట్‌ కొన్నాను. ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్న నా భార్యతో కలిసుండాలన్న ఉద్దేశంతో దుబాయ్‌ను వదిలిపెట్టాలనుకున్నా. లాటరీలో భారీ మొత్తంలో డబ్బు వచ్చిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. కేరళలో సొంత ఇల్లు కట్టుకోవాలన్నది నా చిరకాల స్వప్నం. ఈ లాటరీతో నా కల తీరనుంద’ని టోజో మాథ్యూ సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం తీసిన డ్రాలో ఆయనతో మరో  9 మంది లాటరీ గెలుచుకున్నారు. విజేతల్లో ఐదుగురు భారతీయులు ఉండటం విశేషం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top