క‌రోనా ల్యాబ్‌లో సృ‌ష్టించారు: నోబెల్ గ్ర‌హీత‌

HIV Elements In Coronavirus Says Nobel Winning Scientist - Sakshi

క‌రోనా వైర‌స్ చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే ప్ర‌పంచానికి ప‌రిచ‌య‌మైందంటున్నారు ఫ్రెంచ్ నోబెల్ అవార్డు గ్ర‌హీత ల‌క్ మాంటెగ్నియ‌ర్‌. అక్క‌డి ల్యాబ్‌లో ఎయిడ్స్‌కు వ్యాక్సిన్ క‌నుగొనే క్ర‌మంలో ఈ వైర‌స్ ఉద్భ‌వించిందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా మీడియాకిచ్చిన‌ ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ.. క‌రోనాలో హెచ్ఐవీ జ‌న్యుక్ర‌మం ఉంద‌ని పేర్కొన్నారు. అంతేకాక మ‌లేరియాలో ఉండే అతి సూక్ష్మజీవులు దీనిలోనూ ఉన్నాయ‌ని ఆయ‌న అనుమానం వ్య‌క్తం చేశారు. ముఖ్యంగా ఇలాంటి వైర‌స్‌ల విష‌యంలో వూహాన్ ల్యాబ్‌కు ఎంతో నైపుణ్య‌ముంద‌ని, 2000 సంవ‌త్స‌రం నుంచే అది ప్ర‌యోగాలు చేస్తుంద‌న్నారు. ఇదిలావుంటే చైనాలోని అమెరికా ఎంబ‌సీ అధికారులు వూహాన్ ల్యాబ్‌పై రెండేళ్ల కింద‌టే ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇక్క‌డ ప్రాణాంత‌క వైర‌స్‌ల‌తో పాటు అంటు వ్యాధులపై అధ్య‌య‌నం చేస్తున్నార‌ని వారు గ‌తంలోనే ప్ర‌స్తావించిన‌ప్ప‌టికీ ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. (అమెరికా విచారణకు చైనా నో!)

ఇప్ప‌టికే అంద‌రి దృష్టి వూహాన్ ల్యాబ్‌పై ప‌డింది. అది కావాల‌నే ఈ జీవాయుధాన్ని సృష్టించింద‌న్న వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఆయ‌న మాట‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. ఇప్ప‌టికే అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ స‌హా ఇత‌ర‌ ప్ర‌ముఖులు అది చైనాల పనే అని నిర్ధార‌ణ‌కు వ‌స్తుండ‌గా, అందుకుత‌గ్గ‌ ఆధారాలు మాత్రం ఇంత‌వ‌ర‌కూ వెలుగుచూడ‌లేదు. కాగా వైరాల‌జీ డాక్ట‌ర్‌ ల‌క్ మాంటెగ్నియ‌ర్ హెచ్ఐవీలో ప‌రిశోధ‌న‌కుగానూ ఫ్రాంకోఇయ‌న్ బ‌ర్రీ- సినోస్సీతో క‌లిసి 2008లో నోబెల్ అవార్డును అందుకున్నారు. ఎయిడ్స్ వ్యాధికి  హెచ్ఐవీ వైర‌స్ కార‌ణ‌మ‌వుతుంద‌న్న విష‌యాన్ని వీరి నేతృత్వంలోని బృందం గుర్తించింది. (మీడియా మౌనం.. అసలు కిమ్‌కు ఏమైంది?)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top