పాక్‌ ఎన్నికల్లో పోటీకి హఫీజ్‌ సయీద్‌ దూరం

Hafiz Saeed will not contest 25 July polls - Sakshi

లాహోర్‌: ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్‌ ఉద్‌ దవా నాయకుడు హఫీజ్‌ సయీద్‌ పాకిస్తాన్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాడు. అయితే, జాతీయ, ప్రావిన్షియల్‌ అసెంబ్లీ సీట్లకు 200 మందికిపైగా తన మద్దతుదారులను బరిలోకి దించనున్నాడు. తన పార్టీకి ఎన్నికల కమిషన్‌ గుర్తింపునివ్వకపోవడంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు.

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా(ఎల్‌ఈటీ)కు అనుబంధ సంస్థ అయిన జమాత్‌ ఉద్‌ దవా(జేయూడీ) నాయకుడు హఫీజ్‌ మిల్లీ ముస్లిం లీగ్‌(ఎంఎంఎల్‌) పేరిట రాజకీయ పార్టీని స్థాపించాడు. కానీ, ఎంఎంఎల్‌కు ఎన్నికల కమిషన్‌ గుర్తింపునివ్వలేదు. దీంతో ఈసీ గుర్తింపు ఉన్న అల్లాహు అక్బర్‌ తెహ్రీక్‌(ఏఏటీ)తో ఎంఎంఎల్‌ జట్టు కట్టింది.  సీట్ల పంపకంలో భాగంగా ఎంఎంఎల్‌ 200 మందికిపైగా అభ్యర్థులను రంగంలోకి దించనుంది. ఎంఎంఎల్‌ పార్టీలో చేరిన వారికి ఏఏటీ పార్టీ టికెట్లు ఇస్తామని చెప్పారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top