
గర్ల్‌ఫ్రెండ్ కోసం భారీ ప్రకటన ఇచ్చిన మాంచెస్టర్ యువకుడు
లండన్ : వాలెంటైన్స్ డే దగ్గర పడటంతో సింగిల్స్ జోడీ కోసం వెతుకులాట చేపట్టారు. మనసు మెచ్చిన మగువ కోసం వెరైటీ పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. డేటింగ్ యాప్స్ వర్కవుట్ కాలేదో..మరి ఏమనుకున్నాడో ఓ సింగిల్ ఏకంగా తనతో డేటింగ్‌కు సింగిల్స్ కావాలంటూ హోర్డింగ్‌పైనే ప్రకటన ఇచ్చేశాడు. రూ 40 వేలు ఖర్చు చేసి బిజీ రోడ్‌లో బిల్‌బోర్డుపై తన ఫోటోతో ఫోజిచ్చాడు. తాను మోస్ట్ ఎలిజిబుల్ సింగిల్‌ను అంటూ మాంచెస్టర్ సెంటర్‌లో ఈ ప్రకటనతో ముందుకొచ్చాడు. డేటింగ్ యాప్స్ పనిచేయకపోవడంతో ఓ బిల్‌బోర్డును కొనుగోలు చేసి వైవిధ్యంగా ప్రయత్నిస్తూ డేట్ కోసం పరితపిస్తున్నానని మార్క్ తన ట్విటర్ ఖాతాలో చేసిన పోస్ట్‌కు భారీ స్పందన వస్తోంది. వినూత్న ప్రకటనతో తనతో డేటింగ్ కోసం దరఖాస్తులు వస్తున్నాయని మార్క్ సంబరపడుతున్నాడు. బిల్‌బోర్డు ఒక్కటే కాకుండా ఏదో ఒక రాయి తగలకపోతుందా అంటూ డేటింగ్ మార్క్ పేరిట మార్క్ (30) ఓ వెబ్‌సైట్‌ను కూడా క్రియేట్ చేశాడు.