లాస్ ఎంజెల్స్ ఎయిర్పోర్ట్లో కాల్పులు | gun fire in Los Angeles International Airport, | Sakshi
Sakshi News home page

లాస్ ఎంజెల్స్ ఎయిర్పోర్ట్లో కాల్పులు

Aug 29 2016 10:22 AM | Updated on Oct 2 2018 2:30 PM

లాస్ ఎంజెల్స్ ఎయిర్పోర్ట్లో కాల్పులు - Sakshi

లాస్ ఎంజెల్స్ ఎయిర్పోర్ట్లో కాల్పులు

అమెరికాలోని లాస్ ఎంజెల్స్ అంతార్జాతీయ విమానాశ్రయంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఒకరిని పోలీసులు అదుపులో తీసుకున్నారు.

లాస్ ఎంజెల్స్: అమెరికాలోని లాస్ ఎంజెల్స్ అంతార్జాతీయ విమానాశ్రయంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఒకరిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. మొత్తం ఎయిర్ పోర్ట్ ను భద్రతాధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తొలుత కాల్పుల శబ్దం విన్న సిబ్బంది వెంటనే ఈ సమాచారాన్ని అధికారులకు చెప్పడంతో వారు వేగంగా స్పందించారు. అమెరికాలోని స్వాట్ టీమ్స్ అక్కడికి చేరుకున్నాయి. కీలక సాయుధ బలగాలను మోహరించాయి.

విమానాలను ఎక్కడికక్కడ నిలిపేశారు. కాల్పుల ఘటన జరిగిన నేపథ్యంలో టర్మినల్స్ లోని కొంతమంది ప్రయాణీకులు పరుగులు పెడుతుండగా మరికొందరు ప్రయాణీకులను సురక్షితంగా సమీపంలోని రెస్టారెంట్లకు తరలిస్తున్నారు. ఇంకొందరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ప్రాణనష్టం లక్ష్యంగా ఈ దాడులు జరిపారా లేక కేవలం ఆందోళన సృష్టించేందుకు ఈ పనిచేశారా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికి ఒక టర్మినల్ మొత్తం బలగాలు నిండిపోయాయి. ఒక యువకుడు మాత్రం తుపాకీ పట్టుకుని హల్ చల్ చేస్తూ ఇష్టమొచ్చినట్లుగా కాల్పులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.


Advertisement
Advertisement
 
Advertisement
Advertisement