ఎం‘చొక్కా’ ఆడుకోవచ్చు! | good news to sports star | Sakshi
Sakshi News home page

ఎం‘చొక్కా’ ఆడుకోవచ్చు!

Mar 14 2014 2:48 AM | Updated on Oct 2 2018 8:39 PM

ఎం‘చొక్కా’ ఆడుకోవచ్చు! - Sakshi

ఎం‘చొక్కా’ ఆడుకోవచ్చు!

క్రీడాప్రియులకు శుభవార్త.. ఇన్నాళ్లూ ఇష్టమైన ఆటగాడి పేరున్న షర్టు ధరించి మీరు మ్యాచ్‌లు చూసుంటారు.

 వాషింగ్టన్: క్రీడాప్రియులకు శుభవార్త.. ఇన్నాళ్లూ ఇష్టమైన ఆటగాడి పేరున్న షర్టు ధరించి మీరు మ్యాచ్‌లు చూసుంటారు. ఇకపై  మీకు నచ్చే క్రీడాకారుడు గ్రౌండ్‌లో ఎలాంటి అనుభూతి పొందుతున్నాడో అచ్చం అలాగే మీరూ ఫీలయ్యేలా చేసే షర్టు వేసుకొని మ్యాచ్‌లు చూడొచ్చు. ఆస్ట్రేలియా టెలీకమ్యూనికేషన్ కంపెనీ ఇలాంటి సరికొత్త టెక్నాలజీ షర్టును రూపొందించింది.
 
  ఈ షర్టు వేసుకుంటే ఫుట్‌బాల్ మ్యాచ్‌లో క్రీడాకారుడు భౌతికంగా ఎలాంటి అనుభూతి పొందుతున్నాడో (గోల్ కొట్టినప్పుడు, పరిగెత్తుతున్నప్పుడు) మీరు అదే విధమైన అనుభూతిని స్టేడియంలో కూర్చొని పొందొచ్చు. లీతియం పాలిమెర్ సెల్ బ్యాటరీని షర్టులో వినియోగిస్తారు. సెన్సార్లు, బ్లూటూత్ టెక్నాలజీ ఉపయోగించుకునే మొబైల్ ఫోన్ యాప్ ఆధారంగా ఇది పనిచేస్తుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement