మోసం చేశాడని మగతనాన్ని కాల్చేసింది! | Girlfriend burns her boyfriend's private part for being unfaithful | Sakshi
Sakshi News home page

మోసం చేశాడని మగతనాన్ని కాల్చేసింది!

Sep 16 2015 5:59 PM | Updated on Sep 3 2017 9:31 AM

మోసం చేశాడని మగతనాన్ని కాల్చేసింది!

మోసం చేశాడని మగతనాన్ని కాల్చేసింది!

ప్రియురాలి చేతిలో చెయ్యేసి చేసిన బాస.. తన పాలిట శాపంగా మారుతుందని ఊహించకపోయాడు ఆ ప్రియుడు!

- మాజీ ప్రియురాలిని కలిశాడని బాయ్ఫ్రెండ్పై దాడి
- అసాధారణ నేరంగా పరిగణించి యువతికి జైలుశిక్ష విధించిన కోర్టు


తప్పు చేస్తే ఒకరినొకరు శిక్షించుకోవడం ఆ ప్రేమికుల ఒప్పందం. అలా చేతిలో చెయ్యేసి చేసిన బాస.. తన పాలిట శాపంగా మారుతుందని ఊహించకపోయాడు ఆ ప్రియుడు! అసాధారణ రీతిలో ప్రియురాలు చేసిన పైశాచిక దాడిలో తన మగతనాన్ని తాత్కాలికంగా కోల్పోయాడు. కేసులోని తీవ్రతను గుర్తించిన కోర్టు నిందితురాలికి జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే..

దక్షిణ ఆస్ట్రేలియాలోని మౌంట్ బార్కర్ పట్టణంలో బ్రోన్విన్ పార్కర్ (22) అనే యువతి తన బాయ్ప్రెండ్తో కలిసి సహజీవనం చేస్తోంది. తమ మధ్య ఎలాంటి గొడవలొచ్చినా వారికివారే చిన్నిచిన్న శిక్షలు విధించుకుంటూ.. కలకాలం కలిసుండేలా రాసుకోని ఒప్పందం చేసుకున్నారిద్దరూ. కాగా, సదరు బాయ్ఫ్రెండ్ ఇటీవలే తన మాజీ గర్ల్ఫ్రెండ్ను అనుకోకుండా కలిశాడు. నాలుగు మాటల తర్వాత పాత రోజులు గుర్తుచేసుకుంటూ ఇద్దరూ మైమరచిపోయి ఒక్కటయ్యారు. ఈ సంగతికాస్తా ప్రస్తుత ప్రేయసికి తెలిసిందే. అంతే..

'నన్ను మోసం చేశావు. మాట తప్పావు' అంటూ అంతెత్తున ఎగిరింది. చేసేదేమీ లేక ఒప్పందం ప్రకారం శిక్ష భరించడానికి సిద్ధమయ్యాడు ప్రియుడు. వేడివేడి హెయిర్ స్ట్రైటనర్తో అతని ప్రైవేట్ పార్ట్ ను కాల్చేసింది ప్రియురాలు. దాంతో లబోదిబోమంటూ అరుపులు పెట్టాడు బాధితుడు. విషయం పోలీస్ కేసు నుంచి కోర్టుకు చేరింది.

'ఏదో ఆయనకు బుద్ధి చెబుదామని సరదాగా హెయిర్ స్ట్రైటనర్ ను అంటించా. కానీ ఇంత పెద్ద గాయం అవుతుందని ఊహించలేదు' అని న్యాయస్థానంలో వాపోయింది పార్కర్. అయితే జడ్జిగారు మాత్రం ఆమె చేసింది ముమ్మాటికి నేరమేనని తేల్చిచెబుతూ తొమ్మిది నెలల జైలుశిక్ష విధించారు. బాధిత ప్రేమికుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి అవయవాలు మామూలు స్థితికి రావడానికి కనీసం రెండేళ్లు పడుతుందని వైద్యులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement