పాఠశాలలు ప్రారంభం: వారంలో 70 కరోనా కేసులు

France Reports 70 COVID-19 Cases Among School Children - Sakshi

సాక్షి, పారిస్‌: మార్చి 17 నుంచి ఫ్రాన్స్‌లో లాక్‌డౌన్‌ కఠినంగా అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే వారం రోజులక్రితం ఆంక్షల్ని సడలించడంతో మే 11 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో సుమారు 75 శాతం మంది విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు. పాఠశాలలు ప్రారంభమై వారం రోజులైనా గడవక ముందే 70 కేసులు నమోదు కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. చదవండి: మాజీ కేంద్ర మంత్రి అరెస్ట్‌ 

నేటి నుంచి సడలింపులు మరింత విస్తృతం చేయడంతో సుమారు 1,50,000 మంది విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు. అయితే తరగతి గదికి 15 మంది విద్యార్థులు మాత్రమే ఉండాలి. తప్పని సరిగా మాస్కులను ధరించాలి. ఈ నిబంధనలతోనే స్కూళ్లు తెరచుకున్నాయి. పాఠశాలలతో సంబంధం ఉన్న వారిలో 70 కేసులు నమోదు కావడంపై ఫ్రాన్స్‌ విద్యాశాఖ మంత్రి మిచెల్‌ బ్లాంకెర్‌ మాట్లాడుతూ.. కేసులు నమోదైన స్కూళ్లను వెంటనే మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే నమోదైన కేసులు విద్యార్థుల్లోనా లేక సిబ్బందా అన్న విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. అయితే ప్రాన్స్‌లో ఇప్పటిదాకా 1,42,411 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 28,108 మంది ప్రాణాలు కోల్పోయారు. చదవండి: చైనాకు మరో ముప్పు తప్పదా..!

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top