చైనాకు మరోసారి కరోనా ముప్పు తప్పదా..!

Lack Of Immunity Makes China Vulnerable To Second Wave Of Virus Infection - Sakshi

బీజింగ్‌: ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న మహ్మమారి కరోనా వైరస్‌ను నియంత్రించడంలో చైనా కొంతమేర విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే రాబోయే రోజుల్లో ఈ మహమ్మారి చైనాలో మరోసారి విజృంభించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని చైనాలోని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్‌ జాంగ్‌ నాన్‌షాన్‌  వెల్లడించారు. 2003 లో చైనాలో సార్స్‌ను ఎదుర్కోవటంలో జాంగ్ కీలక పాత్ర పోషించారు. అందుకే ఆయనను చైనాలో 'సార్స్ హీరో' అని పిలుస్తారు. ప్రస్తుతం కరోనా నివారణలో కూడా ఆయన కీలకంగా వ్యవహారిస్తున్నారు. చదవండి: ట్రంప్‌పై ఒబామా సంచలన వ్యాఖ్యలు

ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కట్టడికి ప్రపంచమంతా లాక్‌డౌన్‌లో ఉంది. అయితే కరోనా వైరస్‌ పుట్టిన చైనా మాత్రం తగ్గుముఖం పట్టిందని లాక్‌డౌన్‌ను ఎత్తివేసింది. కానీ గత కొన్ని​ రోజులుగా పరిస్థితి తారుమారై కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా నమోదయ్యే కేసుల్లో కరోనా లక్షణాలు బయటపడకపోవడం మరింత ఆందోళన కలిగించే అంశం. దీంతో వైరస్‌ను కట్టడి చేశామని చెప్పుకుంటున్న చైనా ప్రభుత్వానికి అసలు ప్రమాదం రాబోయే రోజుల్లో ఎదురుకానుందని డాక్టర్‌ జాంగ్‌ హెచ్చరించారు. చదవండి: 'మేము లాఠీలు వాడలేదు, వాడటం లేదు' 

చైనీయులకు రోగనిరోధకత శక్తి తక్కువని ఇది భవిష్యత్‌లో అతి పెద్ద సమస్యగా మారనుందని ఆయన పేర్కొన్నారు. విదేశాలతో పోలిస్తే చైనానే ఎక్కువగా కరోనా కారణంగా ప్రభావితం అవుతుందని హెచ్చరించారు. ప్రస్తుతం కరోనాను అదుపు చేశామన్న భావనలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా.. మరిన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  చదవండి: లాక్‌డౌన్‌ 4.0 : వాటిపై నిషేధం కొనసాగింపు 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top