రెజ్లింగ్ లెవల్లో తన్నుకున్న అమ్మాయిలు | Florida woman gets brutally beaten after throwing a punch at neighbor | Sakshi
Sakshi News home page

రెజ్లింగ్ లెవల్లో తన్నుకున్న అమ్మాయిలు

Oct 5 2016 12:11 PM | Updated on Sep 4 2017 4:17 PM

రెజ్లింగ్ లెవల్లో తన్నుకున్న అమ్మాయిలు

రెజ్లింగ్ లెవల్లో తన్నుకున్న అమ్మాయిలు

ఇప్పుడు ఇంటర్నెట్లో ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. అది కూడా ఇద్దరు మహిళలు చూసేవాళ్లు నోరు వెళ్లబెట్టుకునేలా తన్నుకున్న వీడియో.

న్యూయార్క్: ఇప్పుడు ఇంటర్నెట్లో ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. అది కూడా ఇద్దరు మహిళలు చూసేవాళ్లు నోరు వెళ్లబెట్టుకునేలా తన్నుకున్న వీడియో. ఇది ఫ్లోరిడా రాష్ట్రంలో చోటుచేసుకుంది. బహుశా అది ఉదయం కావొచ్చు. అంతా చక్కటి వాతావరణం. జాగింగ్, ఇతర కసరత్తులు పూర్తి చేసుకునే వేళ. అంబర్ కుక్ అనే ఓ యువతి మంచి బాస్కెట్ బాల్ ప్లేయర్ అనుకుంటా.. చక్కగా నల్లటి బాస్కెట్ బాల్ టీషర్ట్, ఓ బ్లాక్ ప్యాంటు వేసుకొని ఉంది. తన ఇంటి డోర్ ముందు ఏదో ఆలోచించుకుంటు ఉన్న ఆమె వైపు ఓ ఎరుపు రంగు టీషర్ట్ దరించిన యువతి వేగంగా జాగింగ్ కు వచ్చినట్లు వచ్చి నేరుగా వెళ్లి ముఖంపై ఒక్క పంచ్ ఇచ్చింది.

ఆ పంచ్ కు ప్రతి ఘటించిన అంబర్ కుక్ ఒక్కసారిగా భద్రకాళిలా మారింది. తనపై దాడికి దిగిన ఆ అమ్మాయిని ఏకంగా ఓ రెజ్లర్లా ఎత్తిపడేసింది. వరుసపెట్టి ముఖంపైనే పిడిగుద్దులు గుప్పించింది. సవారీ చేస్తున్నట్లుగా ఆమె జుట్టును చేతికందుకొని పైకి కిందికి ఊపుతూ ఎంత డేర్ ఉంటే నన్ను కొడతావ్ అంటూ అదనంగా తన్నడం కూడా మొదలు పెట్టింది. దాంతో దెబ్బలు తింటూ ఆమె చేతి కింద నలిగిపోతున్న యువతి లబోదిబోమంటూ అరవడం తప్ప ఏమీ చేయలేకపోయింది. ఆఖరికి అంబర్ అలిసిపోయిన తర్వాత తన మార్గాన తాను వెళ్లిపోతున్నప్పటికీ మరోసారి దాడి చేసి చుక్కలు చూపించింది. అంబర్ ఎంత ఉగ్ర రూపం దాల్చిందటే వారి ఫైటింగ్ ఆపేందుకు వెళ్లిన పురుషుడు కూడా వెనక్కి తగ్గాడు. అంతలా రెచ్చిపోయి వీధుల్లో వారిద్దరు తన్నుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement