breaking news
Amber Cook
-
ఆస్ట్రల్ పాలీ జోష్- యాంబర్ డౌన్
ముంబై : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో పీవీసి పైపుల కంపెనీ ఆస్ట్రల్ పాలీటెక్నిక్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో పనితీరు నిరాశపరచడంతో కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ యాంబర్ ఎంటర్ ప్రైజెస్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి ఆస్ట్రల్ పాలీ టెక్నిక్ లాభాలతో కళకళలాడుతుంటే.. రికార్డుల మార్కెట్లోనూ యాంబర్ ఎంటర్ ప్రైజెస్ కౌంటర్ నష్టాలతో డీలా పడింది. వివరాలు చూద్దాం.. ఆస్ట్రల్ పాలీటెక్నిక్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఆస్ట్రల్ పాలీటెక్నిక్ నికర లాభం దాదాపు 7 శాతం బలపడి రూ. 88 కోట్లను తాకింది. నికర అమ్మకాలు సైతం 10 శాతం పెరిగి రూ. 747 కోట్లను అధిగమించాయి. అధెసివ్స్ బిజినెస్ 29 శాతం ఎగసి రూ. 190 కోట్లకు చేరడం మెరుగైన పనితీరుకు దోహదం చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఇబిటా మార్జిన్లు 2.2 శాతం పుంజుకుని 21 శాతాన్ని దాటాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఆస్ట్రల్ పాలీటెక్నిక్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 3 శాతం జంప్ చేసి రూ. 1,200 వద్ద ట్రేడవుతోంది. తొలుత 7.2 శాతం పురోగమించి రూ. 1,249ను తాకింది. యాంబర్ ఎంటర్ ప్రైజెస్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో యాంబర్ ఎంటర్ ప్రైజెస్ నికర లాభం 77 శాతం పడిపోయి రూ. 3 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 35 శాతం నీరసించి రూ. 408 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 1.34 శాతం క్షీణించి 4.8 శాతానికి చేరాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం యాంబర్ ఎంటర్ ప్రైజెస్ షేరు ఎన్ఎస్ఈలో 5.5 శాతం పతనమై రూ. 2,193 వద్ద ట్రేడవుతోంది. తొలుత 7.3 శాతం వెనకడుగుతో రూ. 2,150ను తాకింది. -
రెజ్లింగ్ లెవల్లో తన్నుకున్న అమ్మాయిలు
-
రెజ్లింగ్ లెవల్లో తన్నుకున్న అమ్మాయిలు
న్యూయార్క్: ఇప్పుడు ఇంటర్నెట్లో ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. అది కూడా ఇద్దరు మహిళలు చూసేవాళ్లు నోరు వెళ్లబెట్టుకునేలా తన్నుకున్న వీడియో. ఇది ఫ్లోరిడా రాష్ట్రంలో చోటుచేసుకుంది. బహుశా అది ఉదయం కావొచ్చు. అంతా చక్కటి వాతావరణం. జాగింగ్, ఇతర కసరత్తులు పూర్తి చేసుకునే వేళ. అంబర్ కుక్ అనే ఓ యువతి మంచి బాస్కెట్ బాల్ ప్లేయర్ అనుకుంటా.. చక్కగా నల్లటి బాస్కెట్ బాల్ టీషర్ట్, ఓ బ్లాక్ ప్యాంటు వేసుకొని ఉంది. తన ఇంటి డోర్ ముందు ఏదో ఆలోచించుకుంటు ఉన్న ఆమె వైపు ఓ ఎరుపు రంగు టీషర్ట్ దరించిన యువతి వేగంగా జాగింగ్ కు వచ్చినట్లు వచ్చి నేరుగా వెళ్లి ముఖంపై ఒక్క పంచ్ ఇచ్చింది. ఆ పంచ్ కు ప్రతి ఘటించిన అంబర్ కుక్ ఒక్కసారిగా భద్రకాళిలా మారింది. తనపై దాడికి దిగిన ఆ అమ్మాయిని ఏకంగా ఓ రెజ్లర్లా ఎత్తిపడేసింది. వరుసపెట్టి ముఖంపైనే పిడిగుద్దులు గుప్పించింది. సవారీ చేస్తున్నట్లుగా ఆమె జుట్టును చేతికందుకొని పైకి కిందికి ఊపుతూ ఎంత డేర్ ఉంటే నన్ను కొడతావ్ అంటూ అదనంగా తన్నడం కూడా మొదలు పెట్టింది. దాంతో దెబ్బలు తింటూ ఆమె చేతి కింద నలిగిపోతున్న యువతి లబోదిబోమంటూ అరవడం తప్ప ఏమీ చేయలేకపోయింది. ఆఖరికి అంబర్ అలిసిపోయిన తర్వాత తన మార్గాన తాను వెళ్లిపోతున్నప్పటికీ మరోసారి దాడి చేసి చుక్కలు చూపించింది. అంబర్ ఎంత ఉగ్ర రూపం దాల్చిందటే వారి ఫైటింగ్ ఆపేందుకు వెళ్లిన పురుషుడు కూడా వెనక్కి తగ్గాడు. అంతలా రెచ్చిపోయి వీధుల్లో వారిద్దరు తన్నుకున్నారు.