డిసెంబర్‌ 4న క్యాస్ట్రో అంత్యక్రియలు | Fidel Castro's funeral on December 4 | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ 4న క్యాస్ట్రో అంత్యక్రియలు

Nov 26 2016 5:21 PM | Updated on Sep 4 2017 9:12 PM

డిసెంబర్‌ 4న క్యాస్ట్రో అంత్యక్రియలు

డిసెంబర్‌ 4న క్యాస్ట్రో అంత్యక్రియలు

ఫెడల్‌ క్యాస్ట్రో అంత్యక్రియలు డిసెంబర్‌ 4న నిర్వహించనున్నట్లు క్యూబా ప్రభుత్వం వెల్లడించింది.

విప్లవ యోధుడు ఫెడల్‌ క్యాస్ట్రో అంత్యక్రియలు డిసెంబర్‌ 4న నిర్వహించనున్నట్లు క్యూబా ప్రభుత్వం వెల్లడించింది. అలాగే.. ఇవాళ్టి నుంచి తొమ్మిది రోజుల పాటు సంతాపదినాలుగా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్యూబాలోని చారిత్రాత్మక నగరం శాంటియాగోలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

సంతాప దినాలుగా నిర్వహిస్తున్న తొమ్మిది రోజుల పాటు దేశంలో అన్ని కార్యకలాపాలు, ప్రదర్శనలు నిలిపివేస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. అలాగే సంతాప సూచకంగా ప్రభుత్వ కార్యాలయాలు, సైనిక స్థావరాల్లో జాతీయ జెండా సగం ఎత్తులో ఎగురుతుందని తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement