మడకశిర: ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలను కుమార్తెలు ఆపిన ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో జరిగింది. రొళ్ల మండలం కె.బ్యాడిగెరకి చెందిన ఈశ్వరప్ప(94) వృద్ధాప్యంతో శనివారం మృతి చెందాడు. ఇతనికి పద్మ, గౌరమ్మ, మంజుల అనే కుమార్తెలున్నారు. మొత్తం ఆస్తినంతా పద్మకు ఇచ్చాడు. ఆస్తిలో తమకూ భాగం ఇచ్చే వరకు అంత్యక్రియలు చేయకూడదని మిగిలిన ఇద్దరు కుమార్తెలు అడ్డుకున్నారు.
కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఎంత నచ్చజెప్పినా వారు వినలేదు. ఆస్తి పంపకం తర్వాతే అంత్యక్రియలకు ఒప్పుకుంటామని చెప్పారు. పోలీసులు నచ్చజెప్పినా వినకపోవడంతో గ్రామ పెద్దలు కలుగజేసుకుని గౌరమ్మ, మంజులకు 30 సెంట్ల చొప్పున, పద్మకు 60 సెంట్ల భూమి పంపకం చేసేలా ఒప్పందం కుదిర్చారు. దీంతో ఈశ్వరప్ప అంత్యక్రియలు జరిగాయి.


