ఫేస్‌బుక్‌ కార్యాలయం మూసివేత

Facebook Shuts It London Office - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సోషల్‌ మీడియా ‘ఫేస్‌బుక్‌’ లండన్‌లోని తన కార్యాలయాన్ని శుక్రవారం నుంచి మూసివేసింది. మళ్లీ కార్యాలయాన్ని తెరిచే వరకు ఇంటి వద్ద నుంచి పనిచేయాల్సిందిగా ఉద్యోగులను ఆదేశించింది. ఫేస్‌బుక్‌ ఉద్యోగుల్లో ఒకరికి కోవిడ్‌ వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ అవడంతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి సింగపూర్‌లో తమ కంపెనీ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి గత ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు లండన్‌లోని తమ కార్యాలయాన్ని సందర్శించారని, ఆ తర్వాత ఆయనకు కోవిడ్‌ వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయిందని ఫేస్‌బుక్‌ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ( అమెజాన్‌, ఫేస్‌బుక్‌కు కరోనా సెగ )

ఫేస్‌బుక్‌ కార్యాలయం భవనంలో వైరస్‌ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు వైద్య పరంగా శుద్ధి కార్యాక్రమాన్ని చేపడుతున్నామని, అది పూర్తయ్యాక మళ్లీ కార్యాలయాన్ని తెరుస్తామని ఆయన చెప్పారు. ఉద్యోగుల్లో ఎవరైనా జలుబు, దగ్గు, జ్వరంతో బాధ పడుతున్నట్లయితే వారు వెంటనే ఆస్పత్రి సందర్శించి వైద్య చికిత్స చేయించుకోవాలని, ఆ తర్వాత కోలుకున్నాకే తమ కార్యాలయానికి రావాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ( ఇండియాకు సొంత సోషల్‌ మీడియా..! )

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top