ఇస్లామబాద్ వినువీధిలో ఎఫ్-16 యుద్ధవిమానాలు? | F-16 war planes seen in isalamabad skies, says pak journalist | Sakshi
Sakshi News home page

ఇస్లామబాద్ వినువీధిలో ఎఫ్-16 యుద్ధవిమానాలు?

Sep 23 2016 10:33 AM | Updated on Mar 23 2019 8:00 PM

ఇస్లామబాద్ వినువీధిలో ఎఫ్-16 యుద్ధవిమానాలు? - Sakshi

ఇస్లామబాద్ వినువీధిలో ఎఫ్-16 యుద్ధవిమానాలు?

భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో పాక్ పాత్రికేయుడు చేసిన ఒక ట్వీట్ కలకలం రేపింది.

భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో పాక్ పాత్రికేయుడు చేసిన ఒక ట్వీట్ కలకలం రేపింది. ఇస్లామాబాద్ మీదుగా ఆకాశంలో ఎఫ్-16 యుద్ధ విమానాలు ఎగురుతున్నాయని అతడు చెప్పాడు. జియో టీవీలో పనిచేసే హమీద్ మీర్ అనే జర్నలిస్టు ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపాడు. రాణా మహ్మద్ ఉస్మాన్ అనే మరో వ్యక్తి తాను కూడా బాగా పెద్ద శబ్దం విన్నట్లు ట్వీట్ చేశాడు. దక్షిణాసియా దేశాల్లో పేద ప్రజలే ఎక్కువగా ఉన్నారని.. వారికి యుద్ధాలు మంచివి కావని, అందువల్ల ఈ యుద్ధకాంక్షను వెంటనే ఆపాలని మరో ట్వీట్‌లో హమీద్ మీర్ కోరాడు.

ఒక్కసారిగా ఈ ట్వీట్ కలకలం రేపింది. దాంతో కాసేపటికే.. మరో వ్యక్తి మాత్రం ఎవరూ ఆందోళన చెందొద్దని, ఏ క్షణంలో యుద్ధం వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని ఇస్లామాబాద్ వాసులకు చెప్పడానికి పాక్ దళాలే విమానంతో విన్యాసాలు చేశాయని మరో ట్వీట్‌లో చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే పాకిస్థానీ వైమానిక దళం ముందు జాగ్రత్తగా ఎయిర్ డిఫెన్స్ డ్రిల్ చేసి ఉంటుందని అంటున్నారు. అయితే.. దీనిపై అధికారిక ప్రకటనలు మాత్రం ఏవీ వెలువడలేదు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement