
అండమాన్, చైనాల్లో భూకంపం
అండమాన్ ద్వీపం, చైనా వాయువ్య ప్రాంతంలో శుక్రవారం ఉదయం భూకంపాలు సంభవించాయి.
కౌలాలంపూర్/బీజింగ్: బంగాళాఖాతంలోని అండమాన్ ద్వీపంలో శుక్రవారం ఉదయం 11:20 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. మలేషియా పట్ణం పెర్లిస్ కు 782 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన భూకంపం రిక్టర్ స్కేలుపై 5.3 గా నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. కాగా సునామి హెచ్చరికలేవీ జారీ కాలేదని తెలిసింది. మరోవైపు చైనా వాయువ్య రాష్ట్రం జింగ్ జియాన్ రాష్ట్రంలో ఈ రోజు ఉదయం భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతగా నమోదయిన ఈ భూకంపం కారణంగా తీవ్ర ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలిసింది. ఇప్పటివరకు నలుగురు చనిపోయారని, మరో 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారని అధికారులు చెప్పారు. శిధిలాల తొలిగింపు ప్రక్రియపూర్తయ్యేసరికి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.