మా ఆయనకు అమెరికా ఏలే సత్తా ఉంది | Donald Trump's wife Melania 'did not copy' Michelle Obama's speech | Sakshi
Sakshi News home page

మా ఆయనకు అమెరికా ఏలే సత్తా ఉంది

Jul 20 2016 2:35 AM | Updated on Aug 25 2018 7:50 PM

మా ఆయనకు అమెరికా ఏలే సత్తా ఉంది - Sakshi

మా ఆయనకు అమెరికా ఏలే సత్తా ఉంది

అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్‌పై ఆయన భార్య మెలానియా ప్రశంసలు కురిపించారు.

* ట్రంప్ భార్య పొగడ్తలు
* అమెరికాను ఏలే సత్తా ఉంది

క్లీవ్‌లాండ్: అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్‌పై ఆయన భార్య మెలానియా ప్రశంసలు కురిపించారు. ఆయన దయాళువు అని, అమెరికాను పాలించే సత్తా ఉందని కొనియాడారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ట్రంప్‌ను మంచిగా చూపే యత్నం చేశారు. ట్రంప్‌ను తమ పార్టీ అభ్యర్థిగా ఖరారు చేసేందుకు రిపబ్లికన్ పార్టీ  క్లీవ్‌లాండ్‌లో జాతీయ సదస్సును సోమవారం ప్రారంభించింది. మెలానియా మాట్లాడుతూ.. ‘మన దేశమంటే ట్రంప్‌కు ఎనలేని గౌరవముంది.

అమెరికాలో గొప్ప మార్పు తీసుకురాగల సత్తా ట్రంప్‌కు ఉంది’ అని అన్నారు. ఆయన క్రైస్తవులు, ముస్లింలు, అమెరికన్లు, ఆసియన్లు ఇలా అన్ని వర్గాల వారికీ ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. మాజీ ఫ్యాషన్ మోడల్ అయిన 46 ఏళ్ల మెలినియా.. ట్రంప్‌కు మూడో భార్య.  ట్రంప్ తన భార్యను పరిచయం చేస్తూ..‘ఆమె అమెరికాకు గొప్ప మొదటి మహిళ కాబోతున్నార’న్నారు. కాగా 2008లో ఒబామా భార్య మిషెల్ చేసిన ప్రసంగం నుంచి మెలానియా కాపీ కొట్టారనే విమర్శలొచ్చాయి. సదస్సులో రిపబ్లికన్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. భారత్ తమకు రాజకీయాలతోపాటు పలు అంశాల్లో భాగస్వామి అని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement