మరీ అంత ఉత్సాహం పనికి రాదు!  | Dog Is Very Enthusiastic To Eat Ice Cream | Sakshi
Sakshi News home page

మరీ అంత ఉత్సాహం పనికి రాదు! 

May 9 2020 7:37 PM | Updated on May 9 2020 7:57 PM

Dog Is Very Enthusiastic To Eat Ice Cream - Sakshi

ఎథేనా..

అసలే వేసవి కాలం.. చల్లగా ఉండాలని, చల్లగా తినాలని ఎవరికి మాత్రం ఉండదు. ఈ సమ్మర్‌లో ఐస్‌ క్రీమ్‌లు తినటం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనుషులకే కాదు, ఐస్‌ క్రీమ్స్‌ అంటే కుక్కలకు కూడా ఇష్టమే. అందుకే ఐస్‌ క్రీమ్స్‌ను చూడగానే విపరీతమైన ఉత్సాహాన్ని చూపిస్తుంటాయి. ఎథేనా అనే కుక్కపిల్ల కూడా ఐస్‌ క్రీమ్‌ను చూడగానే ఉత్సాహంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. తన యాజమాని చేతుల్తో ఐస్‌ క్రీమ్స్‌ పట్టుకుని కారు దగ్గరకు వస్తుండగా అందులో ఉన్న అది ‘‘  వీలైనంత త్వరగా తెచ్చి ఇవ్వు ’’ అ‍న్నట్లు కారు విండో అద్దాన్ని గోకసాగింది. ఐస్‌ క్రీమ్‌లను చూడగానే దాని ముఖం థౌజండ్‌ వాట్స్‌ బల్బులాగా వెలిగిపోవటం గమనార్హం. ( ధోనీ న్యూ లుక్: ఫ్యాన్స్‌ ఏమన్నారంటే.. )

ఇందుకు సంబంధించిన వీడియోను పుప్‌ మామ్‌, కైలా మారియా అనే టిక్‌టాక్‌ యూజర్‌ తన ఖాతాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కొన్ని గంటల్లోనే 1.4 మిలియన్‌ వీక్షణలను సంపాదించుకుంది. దీనిపై స్పందించిన టిక్‌టాక్‌ యూజర్లు.. ‘‘ నా కుక్కకు కూడా ఐస్‌ క్రీమ్‌ అంటే చాలా ఇష్టం.. కుక్క : ఇవ్వు, ఇవ్వు, ఇవ్వు, ఇవ్వు.. మరీ అంత ఉత్సాహం పనికి రాదు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( వార్నర్‌ కుమ్మేస్తున్నాడుగా..! )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement