కరోనాతో వుహాన్‌ ఆస్పత్రి వైద్యుడు హు వైఫెంగ్ మృతి

Doctor Worked With Li Wenliang In Wuhan Hospital Died Of Corona Virus - Sakshi

బీజింగ్‌: కరోనా వైరస్‌ గురించి ప్రపంచాన్ని హెచ్చరించిన కంటి వైద్యుడు లి వెన్లియాంగ్‌తో కలిసి వుహాన్‌ సెంట్రల్‌ ఆస్పత్రిలో పని చేసిన మరో  వైద్యుడు హు వైఫెంగ్ మంగళవారం కోవిడ్‌-19తో మరణించారు. ఈ విషయాన్ని చైనా జాతీయ మీడియా వెల్లడించింది. వుహాన్ సెంట్రల్ హాస్పిటల్‌లో యూరాలజిస్ట్‌గా పని చేస్తున్న హు వైఫెంగ్ నాలుగు నెలల నుంచి కరోనా, ఇతర అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. గత ఏడాది చివర్లో సెంట్రల్ చైనా నగరంలో ఉద్భవించిన ఈ వైరస్ కారణంగా వుహాన్‌ సెంట్రల్‌ ఆస్పత్రిలో మరణించిన ఆరవ వైద్యుడు హు వైఫెంగ్. కాలేయం దెబ్బతినడం వల్ల అతని చర్మం నల్లగా మారిందని కొన్ని నెలల క్రితం చైనా మీడియా ప్రచారం చేయడంతో హు పరిస్థితి పట్ల దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. (పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి: చైనా)

మరో వైద్యుడు యి ఫ్యాన్‌లో కూడా ఇలాంటి లక్షణాలు బయటపడ్డాయి. కాని ఆయన కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. హు మరణంపై వుహాన్ సెంట్రల్ హాస్పిటల్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఫిబ్రవరి ఆరంభంలో 68 మంది వుహాన్‌ ఆస్పత్రి సిబ్బంది కరోనా వైరస్ బారిన పడ్డారని చైనా మీడియా తెలిపింది. ఫిబ్రవరిలో లి వెన్లియాంగ్ తన చివరి రోజులను డాక్యుమెంట్ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ప్రభుత్వం ఆయనను దేశద్రోహిగా పేర్కొన్న సంగతి తెలిసిందే. లి డిసెంబర్ చివరలోనే వైరస్ గురించి తన సహచరులను హెచ్చరించడంతో అధికారులు అతడిని తీవ్రంగా మందలించారు. (మా వ్యాక్సిన్‌ 99% పని చేస్తుంది)

కోవిడ్‌-19 వల్ల చనిపోయిన వైద్య సిబ్బంది మరణాల పూర్తి సంఖ్యను చైనా ఇంకా విడుదల చేయలేదు. కాని కనీసం 34 మంది వైద్యులు కరోనా కారణంగా మరణించినట్లు సమాచారం. ఫిబ్రవరి చివరి నుంచి చైనాలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 1.4 బిలియన్ల జనాభా ఉన్న దేశంలో అధికారిక మరణాల సంఖ్య 4,634 మాత్రమే. చైనా కన్నా తక్కువ జనాభా ఉన్న దేశాలలో నమోదయిన కేసులు, మరణాలతో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువ.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

09-07-2020
Jul 09, 2020, 03:28 IST
జెనీవా/ న్యూయార్క్‌: గాలి ద్వారా కరోనా వైరస్‌ వ్యాపిస్తుందని ఇప్పటివరకు ఎన్నో అధ్యయనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా కొట్టిపారేస్తూ వచ్చిన...
09-07-2020
Jul 09, 2020, 03:18 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా ఉధృతి పెరుగుతోంది. బాధితుల సంఖ్య 30 వేలకు చేరువైంది. బుధవారం 1,924 మందికి పాజిటివ్‌...
08-07-2020
Jul 08, 2020, 14:37 IST
సాక్షి, విజ‌య‌వాడ‌: ఇంద్ర బస్సులను సంజీవని బస్సులుగా మార్చామని, వీటి ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామ‌ని ఆర్టీసీ ఎండీ...
08-07-2020
Jul 08, 2020, 14:37 IST
 పుదుచ్చేరి :  క‌రోనా నిబంధ‌న‌లు ఉల్లంఘించే దుకాణాదారుల‌పై క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటామ‌ని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి బుధ‌వారం...
08-07-2020
Jul 08, 2020, 14:23 IST
సాక్షి, హైదరాబాద్‌: ఈసీఐఎల్ చౌరస్తాలో బుధవారం మధ్యాహ్నం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. చూస్తుండగానే ఓ యువకుడు రోడ్డుపై కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. 108...
08-07-2020
Jul 08, 2020, 14:01 IST
పూణె :  క‌రోనాకు చిన్నా పెద్దా తేడా అన్న క‌నిక‌రం ఉండ‌దు. అంతేకాకుండా అత్య‌ధిక క‌రోనా కేసులు న‌మోద‌వుతున్న మ‌హారాష్ర్ట‌లో...
08-07-2020
Jul 08, 2020, 13:47 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 27,643 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,062 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం...
08-07-2020
Jul 08, 2020, 13:43 IST
వరంగల్‌: వరంగల్‌లోని వ్యవసాయ, కూరగాయలు, పండ్ల మార్కెట్లకు చెందిన పలువురు వ్యాపారులు కొద్ది రోజులుగా జ్వరాలతో బాధపడుతుండడంతో కరోనా లక్షణాలు...
08-07-2020
Jul 08, 2020, 13:37 IST
సాక్షి, హైదరాబాద్‌:  కరోనా క్లిష్ట సమయంలో ప్రైవేటు ఆస్పత్రుల ‘పైసా’చిక చర్యలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌...
08-07-2020
Jul 08, 2020, 13:21 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టులో ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌కు, సెక్యూరిటీ సిబ్బందికి క‌రోనా పాజిటివ్ అని తేల‌డం క‌ల‌క‌లం రేపుతోంది....
08-07-2020
Jul 08, 2020, 12:31 IST
తూర్పుగోదావరి,రాజోలు: కరోనా సోకిందనే అనుమానంతో టెస్ట్‌లకు వెళ్లేందుకు ఆ చిన్నారి నానా పాట్లు పడింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌...
08-07-2020
Jul 08, 2020, 12:02 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనాపై ప్రజలను చైతన్యం చేసిన కవిగాయకుడు నిస్సార్‌ను మహమ్మారి బలితీసుకుంది. కోవిడ్‌ బారినపడిన ఆయన గాంధీ ఆస్పత్రిలో...
08-07-2020
Jul 08, 2020, 11:33 IST
కర్నూలు(హాస్పిటల్‌): జిల్లాలో కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను స్టేట్‌ కోవిడ్‌ ఆస్పత్రిగా...
08-07-2020
Jul 08, 2020, 11:23 IST
మంచిర్యాలఅర్బన్‌: మంచిర్యాల ఆర్టీసీ డిపో గ్యారేజీలో విధులు నిర్వర్తించే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో కలకలం రేగింది. మంగళవారం...
08-07-2020
Jul 08, 2020, 10:59 IST
దేశవ్యాప్తంగా కోవిడ్‌-19 కలకలం కొనసాగుతోంది
08-07-2020
Jul 08, 2020, 08:44 IST
సాక్షి, సిటీబ్యూరో: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశీయ  సర్వీసులుపరుగులు తీస్తున్నాయి. అన్ని ప్రధాన నగరాలకు రాకపోకలు సాగిస్తున్నాయి....
08-07-2020
Jul 08, 2020, 08:34 IST
లక్డీకాపూల్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలో కోవిడ్‌–19 విలయతాండవం కొనసాగుతోంది. వేలల్లో పాజిటివ్‌ కేసులు తదనుగుణంగా మరణాలూ నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి బారిన...
08-07-2020
Jul 08, 2020, 08:26 IST
జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కల్లోలంకొనసాగుతోంది. అన్ని ప్రాంతాలకూ మహమ్మారి ప్రబలుతుండటంపై సర్వత్రాఆందోళన నెలకొంది. రికార్డు స్థాయిలోకోవిడ్‌–19 పాజిటివ్‌ కేసులు నిర్ధారణఅవుతుండటం.....
08-07-2020
Jul 08, 2020, 08:12 IST
సాక్షి, సిటీబ్యూరో: చిక్కడపల్లికి చెందిన కరుణాకర్‌లో జూన్‌ 28 నుంచి స్వల్ప జ్వరం, జలుబు లక్షణాలు కనిపించాయి. రెండు రోజులైనా...
08-07-2020
Jul 08, 2020, 07:17 IST
సాక్షి, విశాఖపట్నం: ‘విశాఖ తీరం చిత్రమిది.. చాలామంది వైజాగ్‌ అని పిలుచుకునే ఈ సిటీ ఆఫ్‌ డెస్టినీ.. ఆంధ్రప్రదేశ్‌లో అతి...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top