వైరల్‌ : ముక్కులో జలగ | Doctor Bring Out Giant Leech From Man Nose | Sakshi
Sakshi News home page

వైరల్‌ : ముక్కులో జలగ

Jun 11 2018 12:15 PM | Updated on Jun 11 2018 12:35 PM

Doctor Bring Out Giant Leech From Man Nose - Sakshi

బీజింగ్‌ : చైనాకు చెందిన ఓ వ్యక్తి ముక్కు నుంచి వారం రోజులుగా తరచు రక్తం కారుతుండటంతో ఆస్పత్రికి వెళ్లాడు. అతని సమస్య విని ఆశ్చర్యం వ్యక్తం చేసిన డాక్టర్‌కు అలా జరగడానికి గల కారణం అంతుపట్టలేదు. కొన్ని పరీక్షలు నిర్వహించిన డాక్టర్‌ అతని ముక్కు కుడి వైపు రంధ్రంలో రక్తం పీల్చే జలగ ఉందని గుర్తించి షాక్‌ తిన్నాడు. 

అందువల్లే ముక్కు నుంచి రక్తం కారుతుందని నిర్ధారణకు వచ్చిన డాక్టర్‌.. అతని ముక్కులో నుంచి జలగను బయటకు తీశాడు. అది అప్పటికి ప్రాణాలతోనే ఉంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంత పెద్ద జలగ ముక్కులో దూరిన అతనికి తెలియకపోవడం కాసింత ఆశ్చర్యం గొలిపే అంశమే. ముక్కు నుంచి రక్తం కారడాన్ని మొదట తేలికగా తీసుకున్న అతను తన భార్య ముక్కులో ఏదో చూశానని చెప్పడంతోనే ఆస్పత్రికి వెళ్లడాని సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement