ఆసక్తికర విషయాలు వెల్లడించిన లండన్‌ నివేదిక

Coronavirus Immunity May Disappear Within Month - Sakshi

లండన్: కరోనాతో ప్రపంచం అంతా కకావికలమవుతోంది. ఈ మహమ్మారికి ఇంతవరకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాలేదు. సరైన వైద్యం కూడా లేదు. ఇన్ని సమస్యల మధ్య ఒకసారి కరోనా బారిన పడ్డ వారిలో మరోసారి వైరస్‌ లక్షణాలు కనిపిస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో తాజాగా లండన్‌ కింగ్స్‌ కాలేజీ సంచలన విషయాలు వెల్లడించింది. కరోనా వైరస్‌ సోకిన వారిలో నెలల వ్యవధిలో రోగ నిరోధక శక్తి తగ్గడంతో.. మరోసారి తిరిగి వైరస్‌ బారిన పడుతున్నట్లు వెల్లడించింది. తేలికపాటి లక్షణాలు ఉన్న వారిలో కూడా రోగనిరోధక వ్యవస్థ కొంత ప్రతిస్పందనను కలిగి ఉన్నట్లు నివేదిక తెలిపింది. (త్వరలో శుభవార్త అందించబోతున్నాం)

90 మంది కరోనా రోగులను పరీక్షించిన తర్వాత ఈ నివేదిక వెల్లడించింది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు 60 మందిలో వైరస్‌ సంక్రమించిన మొదటి వారాల్లో శక్తివంతమైన ప్రతిస్పందన చూపినట్లు నివేదిక వెల్లడించింది. అంతేకాక 16.7శాతం మందిలో మూడు నెలల తర్వాత కరోనా న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీస్‌ అధిక స్థాయిలో ఉన్నట్లు వెల్లడించింది. అయితే ఎక్కువ అధిక శాతం మందిలో 90 రోజుల తర్వాత యాంటీబాడీస్‌ చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్లు నివేదిక తెలిపింది. దానివల్ల రోగనిరోధక శ​క్తి సన్నగిల్లింది. అందువల్లే ఇలాంటి వారికి మరోసారి కరోనా వచ్చే అవకాశం ఉన్నట్లు నివేదిక తెలిపింది.

శరీరంలో యాంటీబాడీస్‌ ఎక్కువ ఉన్నట్లయితే రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుంది. ఫలితంగా కొత్త వైరస్‌లను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నివేదిక ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. రాబోయే పరిణామాలకు తగ్గట్లు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడానికి ఈ నివేదిక ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. (పెళ్లి విందు అడ్డుకున్నారు..!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top