పెళ్లి విందు అడ్డుకున్నారు..! | Lockdown Rules Break Stop Wedding Dinner in Odisha | Sakshi
Sakshi News home page

పెళ్లి విందు అడ్డుకున్నారు..!

Jul 14 2020 10:10 AM | Updated on Jul 14 2020 10:10 AM

Lockdown Rules Break Stop Wedding Dinner in Odisha - Sakshi

జొగియాపల్లిలో పెళ్లిలో తనిఖీలు చేస్తున్న తహసీల్దార్‌

ఒడిశా ,బరంపురం: గంజాం జిల్లాలోని కుకుడాఖండి సమితి పరిధిలో ఉన్న  జొగియాపల్లి గ్రామంలో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఏర్పాటు చేసిన పెళ్లి భోజనాలను అధికారులు సోమవారం అడ్డుకున్నారు. దాదాపు 500 మందికి భోజనాలు ఏర్పాటు చేసినట్లు తెలుసుకున్న తహసీల్దార్‌ ఈప్సితా ప్రియదర్శిని మిశ్రా పోలీసుల సహకారంతో గ్రామానికి చేరుకుని, చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా పెళ్లి భోజనాలను నిలిపి వేసి, అక్కడి వారికి కరోనా జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. అనంతరం స్వాధీనం చేసుకున్న భోజనాలను కకుడాఖండి క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement