40 వేలు దాటిన కరోనా మరణాలు

Corona Virus: Death Toll In UK Crosses 40,000 - Sakshi

లండన్‌: కరోనా మహమ్మారికి బలవుతున్న వారిసంఖ్య బ్రిటన్‌లో క్రమక్రమంగా పెరుగుతోంది. యూరప్‌లో అత్యధిక కరోనా మరణాలు బ్రిటన్‌లో సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం రోజున 357 మంది ప్రాణాలు కోల్పోగా.. దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా మృతుల సంఖ్య 40,261కి చేరుకున్నట్లు బ్రిటీష్‌ ఆరోగ్యశాఖ కార్యదర్శి మాట్‌ హాన్కాక్‌ వెల్లడించారు. ఆయన‌ మీడియాతో మాట్లాడుతూ.. బ్రిటన్‌లో రోజువారీ కేసులు సంఖ్య మరో 1,650 పెరగడంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,83,311కి చేరింది. చదవండి: 'ఆయన నాపై అత్యాచారం చేశారు' 

‘యూకే అంతటా ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. మా పోరాటంలో మేము పురోగతిని సాధించాము. అయితే చేయాల్సింది ఇంకా చాలా ఉంది. కాగా మిన్నియాపోలీస్‌ క్రూరత్వానికి బలైన నల్ల జాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్య తర్వాత అమెరికాలో జరుగుతున్న నిరసనలకు సంఘీభావంగా.. వారాంతంలో యూకేలో తలపెట్టిన నిరసన కార్యక్రమాలపై ప్రజలు పునరాలోచించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మిమ్మల్ని, మీ కుటుంబాలను రక్షించుకోవడం చాలా అవసరం. మీరు ప్రేమించే వారి కోసం నిరసన ప్రదర్శనలు సహా.. ఎటువంటి సమావేశాలకు హాజరుకావొద్ద’ని ప్రజలకు మాట్‌ హాన్కాక్‌ సూచించారు. కాగా.. కరోనా వైరస్‌ వ్యాప్తి యూరోపియన్‌ దేశాలలో తగ్గుతున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నా.. బ్రిటన్‌లో మాత్రం కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. చదవండి: 24 గంటల్లో 9887 కేసులు.. 294 మరణాలు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top