కశ్మీర్ సమస్యపై నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చైనా ప్రకటించింది.
బీజింగ్: కశ్మీర్ సమస్యపై నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చైనా ప్రకటించింది. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత్–పాకిస్తాన్ మధ్య సంబంధాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని స్పష్టం చేసింది. ప్రస్తుతం కశ్మీర్‌లో పరిస్థితి అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించిందని పేర్కొంది.
చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణాసియాలో భారత్–పాకిస్తాన్ కీలకమైన దేశాలని, అయితే కశ్మీర్‌లో పరిస్థితి అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పారు. నియంత్రణ రేఖ వెంబడి ఇరు దేశాల మధ్యా తలెత్తిన ఉద్రిక్తతలు భారత్–పాక్‌లో సుస్థిరత, శాంతికే కాక.. దక్షిణాసియాలో సుస్థిరతకు, శాంతికి విఘాతం కలిగించే అవకాశం ఉందన్నారు.