ఆ చిన్నారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది

Child Practicing Gymnastics Without Having Hands And Legs - Sakshi

లండన్‌ : రెండు కాళ్లు, చేతులు లేకపోయినా జిమ్నాస్టిక్స్‌ చేస్తూ ఓ చిన్నారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునన్నది.. అక్షర సత్యమని నిరూపించింది చిన్నారి. అసలు బ్రతకటమే కష్టం అనుకున్న ఆ పాప చెంగుచెంగున గెంతుతూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌లోని బాత్‌కు చెందిన హార్మోనీ రోజ్‌ అల్లెన్‌ అనే చిన్నారి 11నెలల వయసులో ఓ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా రెండు కాళ్లు, చేతులు కోల్పోయింది. దీంతో అల్లెన్‌ బ్రతకటం కష్టమని డాక్టర్లు తేల్చిచెప్పేశారు. కానీ డాక్టర్ల అంచనాలను తారుమారు చేస్తూ అల్లెన్‌ ప్రాణాలను నిలుపుకుంది. కానీ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా కాళ్లు, చేతులతోపాటు చిన్నారి ముక్కు కూడా సగం దెబ్బతింది.

అల్లెన్‌కు చికిత్స చేస్తున్న డాక్టర్లు మూడున్నరేళ్ల వయసులో చిన్నారికి ప్రాస్థటిక్‌ కాళ్లను అమర్చారు. వయస్సు పెరిగే కొద్ది అల్లెన్‌ మనసులో ‘‘అందరు పిల్లలలాగా నేనెందుకు ఉండకూడదు’’ అన్న ఆలోచన బయలుదేరింది. ఓ పని చేయాలన్న దృఢ సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని గట్టిగా నమ్మింది. మామూలు మనుషులు సైతం చేయడానికి కష్టపడే జిమ్నాస్టిక్స్‌ నేర్చుకోవటం ప్రారంభించింది. పట్టువదలని విక్రమార్కుడిలా కష్టనష్టాలకోర్చి ముందుకు సాగుతోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top