చిన్నారి గదిలో నల్లతాచు : వీడియో వైరల్‌ | In Child Pile Of Stuffed Animals Vicious Snake | Sakshi
Sakshi News home page

Apr 12 2018 11:15 AM | Updated on Apr 12 2018 9:08 PM

In Child Pile Of Stuffed Animals, Vicious Snake - Sakshi

ఆట బొమ్మల్లో దాక్కున్న నల్లతాచు

పెర్త్‌, ఆస్ట్రేలియా : నేనైతే చచ్చి ఊరుకునే వాడిని.. ఎంత ప్రమాదం తప్పింది. దూరం నుంచి చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది. హో గాడ్‌..! పాపని రక్షించావ్‌. ఏంటీ.. విషయం చెప్పకుండా భయపెట్టే మాటల్ని పరిచయం చేస్తున్నారు. అనుకుంటున్నారా..! ఇవన్నీ మిమ్మల్ని భయపెట్టడానికి కాదు. బుసలు కొడుతున్న ఓ పొడవాటి నల్లతాచు వీడియో చూసి నెటిజన్లు పెట్టిన కామెంట్లు. ఆస్ట్రేలియాలోని ఓ ఇంట్లో ఇప్పుడిప్పుడే నడకలు నేర్చుకుంటున్న ఓ చిన్నారి ఆట బొమ్మల్లో నల్లని తాచు పాగా వేసింది. దాన్ని చూసి ఆ చిన్నారి తండ్రి ఒక్క నిమిషం షాక్‌కు గురయ్యాడు. నోట మాట రాక అలా.. నిలబడిపోయాడు.

వెంటనే తేరుకుని పాము తప్పించుకు పోకుండా కిటికీలు, డోర్లు అన్నింటినీ మూసేసీ పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇచ్చాడు. స్నేక్‌ క్యాచర్‌ వచ్చి ఆ కాల నాగుని పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పాము ఆట బొమ్మల్లో దూరినపుడు చిన్నారి ఆ గదిలో లేకపోవడంతో ప్రమాదం తప్పిందని ఆమె తల్లి చెప్పారు. ఆట బొమ్మల్లో దాక్కున్న పాముని పట్టుకునే క్రమంలో స్నేక్‌ క్యాచర్‌ ఆండ్రూస్‌ తీసిన వీడియో ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో వైరల్‌ అయింది. నల్లగా మెరుస్తూ.. బుసలు కొడుతున్న కాలనాగు వీడియో చూస్తే ఎవరికైనా ఒళ్లు జలదరించాల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement