హెల్మెట్ లేదని కాంబోడియా ప్రధానికి ఫైన్ | Cambodian PM fined for not wearing helmet during motorbike ride | Sakshi
Sakshi News home page

హెల్మెట్ లేదని కాంబోడియా ప్రధానికి ఫైన్

Jun 24 2016 1:38 AM | Updated on Oct 2 2018 4:31 PM

హెల్మెట్ లేదని కాంబోడియా ప్రధానికి ఫైన్ - Sakshi

హెల్మెట్ లేదని కాంబోడియా ప్రధానికి ఫైన్

మోటారు బైకుపై వెళుతూ హెల్మెట్ ధరించని కారణంగా కాంబోడియా ప్రధాని హన్‌సేన్‌కు అక్కడి పోలీసులు జరిమానా విధించారు.

పెన్హ్: మోటారు బైకుపై వెళుతూ హెల్మెట్ ధరించని కారణంగా కాంబోడియా ప్రధాని హన్‌సేన్‌కు అక్కడి పోలీసులు జరిమానా విధించారు. దీంతో తాను చేసిన పొరపాటుకు ప్రధాని బహిరంగంగా క్షమాపణ చెప్పారు. జూన్ 18న కోకాంగ్‌లో పర్యటించిన ఆయన అక్కడ రోడ్డుపక్కన ఉన్న మోటార్ టాక్సీ డ్రైవర్‌ను కలిశాడు. ఈ సందర్భంగా టాక్సీ డ్రైవర్‌ను వెనుక కూర్చొబెట్టుకొని సరదాగా 250 మీటర్లు హెల్మెట్ లేకుండా బైక్ నడిపారు. దీంతో అక్కడి ట్రాఫిక్ పోలీస్ అధికారి ప్రధానికి దాదాపు 15,000 కాంబోడియన్ రియాలు (దాదాపు రూ.250) జరిమానా విధించారు. ఈ విషయాన్ని ప్రధాని బుధవారం తన ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement