హనీమూన్ లో విషాదం.. | Sakshi
Sakshi News home page

హనీమూన్ లో విషాదం..

Published Sat, May 28 2016 3:33 PM

హనీమూన్ లో విషాదం..

బ్యాంకాక్: హనీమూన్ కోసం భర్తతో పాటు విదేశానికి వెళ్లగా అక్కడ విషాదం చోటుచేసుకుంది. బ్రిటన్ కు చెందిన మోనికా ఒ.కార్నర్ తన భర్తతో థాయ్ లాండ్ కు వెళ్లింది. అక్కడ జరిగిన బోట్ ప్రమాదంలో కొత్త జంటలో భార్య, మరో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. కో సమూయ్ తీరంలో పడవలో భార్యాభర్తలు గురువారం సాయంత్రం షికారుకు బయలుదేరారు. వీరితో పాటు మరికొందరు పర్యాటకులు ఉన్నారు. 32 మంది టూరిస్టులు, నలుగురు సిబ్బందితో బోట్ బయలుదేరగా వాతావరణం అనుకూలించకపోవడంతో బోట్ మునిగిపోయిందని కెప్టెన్ గా సనన్ సీకాకియా వ్యవహరించారు.

పడవ ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్ అక్కడికి వెళ్లి చాలా మందిని త్వరగానే రక్షించినట్లు సమాచారం. జర్మనీకి చెందిన వ్యక్తితో పాటు, హాంకాంగ్ కు చెందిన యువతి కూడా మృతిచెందారని టూరిస్ట్ పోలీసులు వెల్లడించారు. వివాహం మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి వచ్చిన మరో జంట కూడా ఈ ఘటనలో తప్పిపోయారని వారి కోసం రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు చేపట్టిందని బోటు కెప్టెన్ చెప్పారు. పూజా పార్నెల్, మోనికా భర్తల వివరాలు తమకు అందుబాటులో లేవని వెల్లడించారు.

Advertisement
 
Advertisement