
లండన్: ముంబై నుంచి లండన్‌కు బయలుదేరిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానం సాంకేతిక కారణాలతో అత్యవసరంగా అజర్‌బైజాన్‌లోని బాకూలో ల్యాండైంది. సోమవారం మధ్యాహ్నం 1.15 గంటలకు ముంబైనుంచి బీఏ198 విమానం బయలుదేరాల్సి ఉండగా.. ఫస్ట్‌క్లాస్ కేబిన్‌లో పొగరావటంతో మూడున్నర గంటలు ఆలస్యంగా బయలుదేరింది. అనంతరం అజర్‌బైజాన్ సమీపంలో ఉన్నప్పుడు ఇదే సమస్య తలెత్తటంతో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ‘సాంకేతిక కారణాలతో బాకూలో ఆగాం’ అంటూ ఓ ప్రయాణికుడు ట్వీట్ చేయటంతో ఈ విషయం తెలిసింది. ఆ బోయింగ్ 777 విమానంలో ఎందరు ప్రయాణీకులున్నారనే విషయాన్ని విమానయాన సంస్థ వెల్లడించలేదు.