కరోనా కొత్త హాట్‌స్పాట్‌: ఒక్కరోజులో వెయ్యి మరణాలు!

Brazil Register Over 1000 Covid 19 Deceased In 24 Hours - Sakshi

బ్రెసీలియా: లాటిన్‌ అమెరికా దేశం బ్రెజిల్‌పై కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో అక్కడ 1179 మంది కరోనాతో మృతి చెందినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 17,971కి చేరినట్లు పేర్కొంది. అదే విధంగా మంగళవారం నాడు కొత్తగా 17,408 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని... దీంతో మొత్తం కరోనా సోకిన బాధితుల సంఖ్య 2,71,628కి చేరుకుందని తెలిపింది. కాగా బ్రెజిల్‌లో ఒక్కరోజే వెయ్యికి పైగా కరోనా మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో కోవిడ్‌ వ్యాప్తి విస్తృతమవుతున్న కారణంగా మరిన్ని చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో అతి తక్కువ సంఖ్యలో కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహిస్తున్న కారణంగా.. కేసుల సంఖ్య, మరణాల సంఖ్య 15 రెట్లు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.(బ్రెజిల్‌ ప్రయాణాలపై నిషేధం‌: ట్రంప్‌)

కాగా గత మూడు రోజులుగా బ్రెజిల్‌లో మహమ్మారి తీవ్రత ఉధృతమవుతోంది. ఈ క్రమంలో అత్యధిక కేసులు నమోదైన జాబితాలో బ్రిటన్‌, స్పెయిన్‌, ఇటలీని అధిగమించి బ్రెజిల్‌ మూడో స్థానానికి చేరింది. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రయాణాలపై నిషేధం విధించే ఆలోచనలో ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. ఇదిలా ఉండగా.. బ్రెజిల్‌ అధ్యక్షుడు జేర్‌ బోల్సోనారో ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకై ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. (కరోనా: ఫ్రాన్స్‌ను దాటేసిన బ్రెజిల్‌)

అదే విధంగా.. లాటిన్‌ అమెరికాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరొందిన బ్రెజిల్‌ను తిరిగి పూర్వస్థితికి తీసుకురావడానికి కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాలని పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో 27 రాష్ట్ర ప్రభుత్వాలు, అధ్యక్షుడి మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా... కోవిడ్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో యాంటీ- మలేరియా డ్రగ్‌ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఉపయోగం, కోవిడ్‌-19 చికిత్సలో పాటించాల్సిన నూతన ప్రొటోకాల్‌ గురించి తమ ఆరోగ్యశాఖా మంత్రి వివరాలు వెల్లడిస్తారని బోల్సోనారో ప్రకటించారు.(కరోనా సోకినా వారు చనిపోరు: బ్రెజిల్‌ అధ్యక్షుడు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

26-10-2020
Oct 26, 2020, 18:44 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కేసులు పూర్తిగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 51,544 కరోనా...
26-10-2020
Oct 26, 2020, 16:44 IST
న‌టి, నిర్మాత చార్మీ కౌర్ త‌ల్లిదండ్రులు క‌రోనా బారిన ప‌డ్డారు. అక్టోబ‌ర్ 22న వారికి క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ...
26-10-2020
Oct 26, 2020, 14:18 IST
న్యూఢిల్లీ : ఇప్పటికే రెండు ట్రయల్స్‌ను దిగ్విజయంగా పూర్తి చేసుకొని మూడవ ట్రయల్స్‌ను కొనసాగిస్తోన్న ‘ఆక్స్‌ఫర్డ్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌’ మొదటి విడతను...
26-10-2020
Oct 26, 2020, 11:14 IST
కొన్ని దేశాల్లోని ప్రజలందరికీ టీకా అందించడం కంటే కూడా, అన్ని దేశాల్లోని కొంతమంది ప్రజలకు వాక్సినేషన్‌ చేయడం ఉత్తమమని ప్రపంచ...
26-10-2020
Oct 26, 2020, 10:02 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌  విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 79,09,000 దాటాయి. గడచిన...
26-10-2020
Oct 26, 2020, 08:27 IST
వాషింగ్టన్‌: తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే అమెరికన్లందరికీ ఉచితంగా వాక్సిన్‌ అందిస్తానని డెమొక్రాటిక్‌ అభ్యర్ధి జోబైడెన్‌ హామీ ఇచ్చారు. తన సొంతరాష్ట్రం...
25-10-2020
Oct 25, 2020, 16:59 IST
సాక్షి, అమరావతి : గడిచిన 24 గంటల్లో 67,419 కరోనా వైరస్‌ శాంపిల్స్‌ను‌ పరీక్షించగా.. 2,997 మందికి‌ పాజిటివ్‌గా నిర్థారణ...
25-10-2020
Oct 25, 2020, 10:20 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో గడిచిన 24 గంటల్లో 50,129 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల...
25-10-2020
Oct 25, 2020, 04:57 IST
గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ కరోనా బారినపడ్డారు. కొన్ని రోజులుగా గ్రామాల్లో పర్యటనలు, తర్వాత శ్రీవారి...
24-10-2020
Oct 24, 2020, 17:22 IST
సాక్షి, అమరావతి : ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది.  రాష్ట్రంలో...
24-10-2020
Oct 24, 2020, 14:58 IST
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో  కరోనా మహమ్మారి  బారిన పడుతున్న రాజకీయ నాయకులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,...
24-10-2020
Oct 24, 2020, 12:14 IST
కరోనా వ్యాక్సిన్‌పై ఎందుకు రాజకీయాలు చేస్తారు..?. టీకాపై ఒక్క బిహార్‌కే కాదు దేశం మొత్తానికి సమాన హక్కులు ఉన్నాయి.
24-10-2020
Oct 24, 2020, 10:46 IST
సమాచారం అందుకున్న పోలీసులు కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆ బట్టల దుకాణాన్ని సీజ్‌ చేశారు.
24-10-2020
Oct 24, 2020, 09:54 IST
దేశంలో కరోనా రోగులకు ప్లాస్మా థెరపీ చికిత్స ద్వారా పెద్దగా ఫలితం లేదని బ్రిటీష్‌ మెడికల్‌ జర్నల్‌ తెలిపింది.
24-10-2020
Oct 24, 2020, 07:32 IST
సా​‍క్షి, హిమాయత్‌ నగర్‌:  మన ఒంటి శుభ్రమే కాదు. చేతుల శుభ్రం కూడా చాలా ముఖ్యం. రోజూ మనం ఎంతోమందిని...
24-10-2020
Oct 24, 2020, 06:09 IST
ఏడాది చివర్లోగా వ్యాక్సిన్‌ మార్కెట్‌లో విడుదల అవతుందని ఆశిస్తున్నామన్నారు. ఆశుభ ఘడియ రాగానే ప్రభుత్వమే పూర్తి ఖర్చును భరించి రాష్ట్ర...
24-10-2020
Oct 24, 2020, 04:36 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఒకేరోజు రికార్డు స్థాయిలో 80,238 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా వచ్చినప్పట్నుంచి ఇదే ఆల్‌టైమ్‌...
23-10-2020
Oct 23, 2020, 19:35 IST
సాక్షి, అమరావతి :  ఏపీలో గడిచిన 24 గంటల్లో 80,238 కరోనా సాంపిల్స్‌ పరీక్షలు నిర్వహించగా.. 3,765 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా...
23-10-2020
Oct 23, 2020, 15:28 IST
బెంగళూరు: కరోనా మహమ్మారి గురించి రోజుకొక షాకింగ్‌ న్యూస్‌ వెలుగులోకి వస్తోంది. తాజాగా ఇలాంటి వార్త మరొకటి తెలిసింది. కరోనాతో...
23-10-2020
Oct 23, 2020, 14:27 IST
కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఈ నవంబర్‌లో నిర్వహించే పరిస్థితి లేదని మంత్రి గౌతమ్‌రెడ్డి‌ అన్నారు.
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top