ఎనిమిదేళ్ల బాలుడు చెల్లిని షూట్ చేశాడు! | Boy shoots his sister while his Mum leaves them home alone | Sakshi
Sakshi News home page

ఎనిమిదేళ్ల బాలుడు చెల్లిని షూట్ చేశాడు!

Feb 8 2017 1:19 PM | Updated on Jul 12 2019 3:02 PM

ఎనిమిదేళ్ల బాలుడు చెల్లిని షూట్ చేశాడు! - Sakshi

ఎనిమిదేళ్ల బాలుడు చెల్లిని షూట్ చేశాడు!

ఇద్దరు పిల్లలను ఇంట్లో ఉంచి బయటకు వెళ్లి వచ్చిన మహిళకు ఊహించని విషాదం ఎదురైంది.

న్యూయార్క్: ఇద్దరు పిల్లలను ఇంట్లో ఉంచి బయటకు వెళ్లి వచ్చిన మహిళకు ఊహించని విషాదం ఎదురైంది. ఇద్దరిలో ఒకరు నిర్జీవంగా పడి ఉండటాన్ని గమనించి ఆ తల్లికి గుండె ఆగినంత పనైంది. ఎనిమిదేళ్ల బాలుడు.. తన సోదరిని కాల్చిన  ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటు చేసుకుంది.

జాక్స్విల్లే విచారణ అధికారి క్రిస్ బట్లర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. సెరినిటి అలెన్(5) అనే చిన్నారికి బుల్లెట్ తగలడంతో మృతి చెందింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారులకు గన్ దొరకడంతో.. ఈ ప్రమాదం జరిగింది. బాలుడు పొరపాటున షూట్ చేయడంతో.. ఓ బుల్లెట్ చెల్లికి తగిలి మృతి చెందిందని వెల్లడించారు. తాను స్టోర్కు వెళ్లి వచ్చేలోగా ఈ దుర్ఘటన జరిగిందని తల్లి వాపోయింది. కాగా తుపాకిని పిల్లలకు దొరికేలా అలా నిర్లక్ష్యంగా ఉంచిన ఆమె బాయ్ప్రెండ్ మోరీస్ మొబ్లీని పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement