బూస్టర్ రాకెట్ ల్యాండింగ్ సక్సెస్ | Booster rocket landing Success | Sakshi
Sakshi News home page

బూస్టర్ రాకెట్ ల్యాండింగ్ సక్సెస్

Apr 10 2016 9:08 AM | Updated on Sep 3 2017 9:33 PM

బూస్టర్ రాకెట్ ల్యాండింగ్ సక్సెస్

బూస్టర్ రాకెట్ ల్యాండింగ్ సక్సెస్

ఐఎస్‌ఎస్ కు సరుకులను మోసుకెళ్లే రాకెట్‌ను నింగిలోకి పంపాక బూస్టర్ రాకెట్‌ను ప్రైవేటు అంతరిక్ష సంస్థ ‘స్పేస్‌ఎక్స్’ తిరిగి విజయవంతంగా తొలిసారిగా సముద్ర జలాలపై తేలియాడే ప్లాట్‌ఫామ్‌పై ల్యాండ్ చేసింది.

కేప్ కనావరెల్(యూఎస్): అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)కు సరుకులను మోసుకెళ్లే రాకెట్‌ను నింగిలోకి పంపాక బూస్టర్ రాకెట్‌ను ప్రైవేటు అంతరిక్ష సంస్థ ‘స్పేస్‌ఎక్స్’ తిరిగి విజయవంతంగా తొలిసారిగా సముద్ర జలాలపై తేలియాడే ప్లాట్‌ఫామ్‌పై ల్యాండ్ చేసింది. ప్రయోగించిన వెంటనే ప్రధాన రాకెట్ మరింత వేగంగా దూసుకుపోయేందుకు ఈ బూస్టర్ రాకెట్‌లు సాయపడతాయి.

తర్వాతి దశలో ప్రధాన రాకెట్ నుంచి విడిపోయి సముద్రంలో పడేలా సాధారణంగా వీటిని డిజైన్‌చేస్తారు. ఐసిస్‌కు సరుకులను తీసుకెళ్లే ఫాల్కన్9 రాకెట్ శుక్రవారం కేప్ కనావరెల్ ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి దూసుకుపోయాక ఈ బూస్టర్ రాకెట్ సముద్రంలోని ప్లాట్‌ఫామ్‌పై ల్యాండ్‌అయ్యింది. గతంలో ఇలా చేసిన పలు ప్రయోగాలు విఫలమయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement