బీబీసీ కార్యాలయం వద్ద బాంబు కలకలం | BBC's headquarters have been evacuated amid a bomb scare | Sakshi
Sakshi News home page

బీబీసీ కార్యాలయం వద్ద బాంబు కలకలం

Dec 1 2015 10:17 PM | Updated on Sep 3 2017 1:19 PM

బీబీసీ కార్యాలయం వద్ద బాంబు కలకలం

బీబీసీ కార్యాలయం వద్ద బాంబు కలకలం

ప్రపంచ ప్రఖ్యాత న్యూస్ ఛానెల్ బీబీసీ ప్రధాన కార్యాలయం వద్ద బాంబు కలకలం చెలరేగింది.

లండన్: ప్రపంచ ప్రఖ్యాత న్యూస్ ఛానెల్ బీబీసీ ప్రధాన కార్యాలయం వద్ద బాంబు కలకలం చెలరేగింది. సెంట్రల్ లండన్ లోని ఛానెల్ ఆఫీసు వద్ద ఓ అనుమానిత వాహనం గంటలకొద్ది నిలిచిఉండటంతో అందులో బాంబులు ఉన్నాయనే అనుమానం అక్కడి సిబ్బందిని వణికించింది. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బీబీసీ ఆఫీసుతోపాటు చుట్టుపక్కల కార్యాలయాలను ఖాళీచేయించారు.

 

అనుమానిత కారును అణువణువూ పరిశోధించిన బాంబు స్క్వాడ్ చివరికి పేలుడు పదార్థాలేవీ లేవని తేల్చడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇటీవలి పారిస్ దాడులు, అంతకు ముందు చార్లిస్ హెబ్డో పత్రికా కార్యాలయంపై ఉగ్రపంజా ఘటనల దృష్ట్యా ప్రధాన నగరాల్లోని అన్ని పత్రికా, టీవీ ఛానెళ్ల వద్ద నిఘా పెంచిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement